
బెంగళూరును వణికించిన కిషన్
సోమవారం రాత్రి చివరి వరకు ఉత్కంఠంగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్‌పై సూపర్ ఓవర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని అందుకుంది. అయితే ఇషాన్ కిషన్ (99; 58 బంతుల్లో 2×4, 9×6) ఒక్క పరుగు తేడాతో సెంచరీకి దూరమైనా భారీ సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. లక్ష్య ఛేదనలో బెంగళూరును వణికించాడు. టాప్‌ఆర్డర్ వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన కిషన్.. దూకుడుగా ఆడాడు. కీరన్ పొలార్డ్ (24 బంతుల్లో 60 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు)తో కలిసి విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 99 పరుగుల వద్ద ఔట్ అయినా.. మ్యాచ్ టై కావడంలో కీలక పాత్ర పోషించాడు.

నిన్ను చూసి గర్వపడుతున్నా బేబీ
అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్ కిషన్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. జట్టు యాజమాన్యం, వ్యాఖ్యాతలు, విశ్లేషకులు అతడిని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, బెంగళూరు సారథి విరాట్ కోహ్లీలు సైతం మ్యాచ్ అనంతరం కొనియాడారు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ప్రేయసిగా భావిస్తున్న టాప్ మోడల్ అదితి హుండియా సైతం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పొగిడేసింది. 'నిన్ను చూసి నేనెంతగానో గర్వపడుతున్నాను బేబీ' అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. బేబీ అని సంబోదించడంతో కిషన్, అదితిల మధ్య సమ్‌థింగ్.. సమ్‌థింగ్ అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ముంబై జట్టుకి ఫ్యాన్‌గర్ల్
ఇషాన్ కిషన్ ఇప్పటివరకు 38 ఐపీఎల్ మ్యాచులు ఆడి 794 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. గత కొంత కాలంగా ముంబై జట్టుకు ఆడుతున్న కిషన్.. అప్పుడప్పుడు మెరుపు ప్రదర్శనలు చేశాడు. గత రాత్రి మాత్రం తనలోని సత్తాను చాటాడు. మరోవైపు అదితి ముంబై జట్టుకి ఫ్యాన్‌గర్ల్. గతంలోనూ వాంఖడేలో ముంబైకి మద్దతుగా నిలిచింది. చాలాకాలంగా ఆమె ఇషాన్‌తో ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ చనువుగా దిగిన చిత్రాలు నెట్టింట వైరల్ అయ్యాయి. మిస్ రాజస్థాన్‌గా ఎంపికైన అదితి 2017లో మిస్ ఇండియా పోటీల్లో భాగమైంది. మిస్ దివా 2018లో మిస్ దివా సుప్రానేషనల్‌గా గెలిచింది.

సూపర్ ఓవర్లో ఆడని కిషన్
మ్యాచ్ ఆసాంతం బాగా ఆడినా.. సూపర్ ఓవర్లో ఇషాన్ కిషన్ బరిలోకి దిగలేదు. సూపర్ ఓవర్లో ఇషాన్ కిషన్‌ను పంపించకపోవడం విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలపై ముంబై కోచ్ జయవర్దనె స్పందించాడు. 'అప్పటికే కిషన్ అలసిపోయాడు. అందుకే బంతిని చక్కగా బాదే, అలసట లేనివారిని పంపించాలని నిర్ణయించుకున్నాం. బయట నుంచి మాట్లాడటం చాలా సులువే. గతంలో సూపర్ ఓవర్లలో పొలార్డ్, పాండ్యాకు రాణించిన అనుభవం ఉంది. వారిద్దరూ ఆ పనిచేయగల సమర్థులే. కానీ ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. మేం గనక 10-12 పరుగులు చేసుంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో' అని జయవర్దనె అన్నాడు.
RCB vs MI: డివిలియర్స్ మెరుపు హాఫ్ సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు సమం!!


Click it and Unblock the Notifications












