Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ క్రికెటర్ అంటే నాకు పిచ్చి.. నా ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ అదే: రష్మిక మందన్న

న్యూఢిల్లీ: సౌతిండియా స్టార్ హీరోయిన్, పాన్ ఇండియా బ్యూటీ రష్మిక మందన్న తన ఫేవరేట్ క్రికెటర్ ఎవరో చెప్పింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చని తెలిపింది. అధికారిక స్టార్ స్పోర్ట్స్‌తో సరదాగా చిట్ చాట్ చేసిన రష్మిక.. కోహ్లీ దూకుడు, బ్యాటింగ్ శైలి తనకు చాలా నచ్చుతాయని పేర్కొంది. బెంగళూరు అమ్మాయిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టునే అభిమానిస్తానని వెల్లడించింది.

'నేను బెంగళూరు వాసిని. కర్ణాటక అమ్మాయిని. మాకు ఈసా కప్ నమ్దే స్లోగన్ ఉంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. ఈసారి ఆర్‌సీబీ ఫైనల్ వెళ్తుందని నేను భావిస్తున్నా.'అని పేర్కొంది. ఫేవరటే క్రికెట్ విరాట్ కోహ్లీ సర్ అని చెప్పిన రష్మిక.. అతని దూకుడు, బ్యాటింగ్ శైలి నచ్చుతాయని పేర్కొంది.

Rashmika Mandanna reveals her favourite cricketer

ఐపీఎల్ 2023 సీజన్‌లో పడుతూ లేస్తూ ముందుకు సాగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నేడు( సోమవారం) లక్నో వేదికగా రాత్రి జరగనున్న మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌‌లో కేకేఆర్ చేతిలో అనూహ్యంగా ఓడిన ఆర్‌సీబీ.. మళ్లీ విజయాల బాట పట్టడంపై ఫోకస్ పెట్టింది.

అంతేకాకుండా తొలి దశ పోటీల్లో లక్నో చేతిలో ఎదురైన థ్రిల్లింగ్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది. బెంగళూరు వేదికగా జరిగిన నాటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్ రష్మిక మందన్నతో చిట్ చాట్ చేసింది. మ్యాచ్ సమయంలో పూర్తి వీడియోను ప్లే చేసే అవకాశం ఉంది.

పాన్ ఇండియా మూవీ పుష్ప మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించిన రష్మిక.. పుష్ప-2లోని నటిస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ఐటెం సాంగ్ చెయ్యడానికి రష్మీక రెడీ అయ్యిందని టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ స్పెషల్ సాంగ్‌లో నటించడానికి రష్మిక దాదాపుగా ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తోందట. అయితే అంత మొత్తం కూడా ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నట్లు సోషల్ మీడియా టాక్.

Story first published: Monday, May 1, 2023, 16:26 [IST]
Other articles published on May 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+