లక్నో: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. స్లో వికెట్‌పై పరుగులు చేయలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్(40 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 44), కెప్టెన్ విరాట్ కోహ్లీ(30 బంతుల్లో 3 ఫోర్లతో 31) మినహా మరే బ్యాటర్ రాణించలేదు.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 126 పరుగులే చేసింది. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ మూడు వికెట్లు తీయగా.. రవిబిష్ణోయ్, అమిత్ మిశ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ దక్కింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ(31), ఫాఫ్ డుప్లెసిస్ శుభారంభాన్ని అందించారు. పిచ్ కాస్త స్లోగా ఉండటంతో ఆచితూచి బ్యాటింగ్ చేశారు. దాంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. క్రీజులో పాతుకుపోతున్న ఈ జోడీ రవి బిష్ణోయ్ విడదీసాడు. అద్భుత బంతితో విరాట్ కోహ్లీ(31)ని స్టంపౌట్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 62 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
క్రీజులోకి వచ్చిన అనూజ్ రావత్(9) మరోసారి దారుణంగా విఫలమయ్యాడు. పరుగులు చేయడానికి తీవ్రంగా తడబడిన అనూజ్ రావత్ చివరకు కృష్ణప్ప గౌతమ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఆ వెంటనే మ్యాడ్ మ్యాక్స్‌వెల్(4)ను రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో మ్యాక్సీ వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఈ పరిస్థితుల్లో సుయాశ్ ప్రభుదేశాయ్‌తో కలిసి ఫాఫ్ డుప్లెసిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. కానీ పరుగుల వేగం తగ్గడంతో సుయాశ్ భారీ షాట్‌కు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. అమిత్ మిశ్రా బౌలింగ్‌లో కృష్ణప్ప గౌతమ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. క్రీజులోకి దినేశ్ కార్తీక్ రాగా.. వర్షం మ్యాచ్‌కు అంతరాయం కలిగించింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో అరగంట తర్వాత మళ్లీ ఆట మొదలైంది.
దినేశ్ కార్తీక్.. బౌండరీ, సిక్స్ బాది జోరు కనబర్చగా.. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో డుప్లెసిస్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్(3) కూడా విఫలమయ్యాడు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. లోమ్రోర్ రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత దినేశ్ కార్తీక్(16) రనౌటవ్వగా.. చివరి ఓవర్‌లో కర్ణ్ శర్మ(2) కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన సిరాజ్ కూడా గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. ఆఖరి బంతిని హసరంగా బౌండరీ బాది జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించాడు.