Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2024: చరిత్ర సృష్టించిన మయాంక్ యాదవ్!

లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే మూడు సార్లు 155 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేసిన తొలి పేసర్‌గా నిలిచాడు.

మయాంక్ యాదవ్ కేవలం 2 మ్యాచ్‌ల్లో 50 బంతులు మాత్రమే బౌలింగ్ చేసి ఈ ఫీట్ సాధించాడు. ఉమ్రాన్ మాలిక్, అన్రిచ్ నోకియా మాత్రమే 2 సార్లు 155 కిలోమీట్లర కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మంగళవారం జరిగిన మ్యాచ్‌‌లో మయాంక్ యాదవ్ ఈ ఘనతను అందుకున్నాడు.

Mayank Yadav

ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో షాన్ టెయిట్ వేసిన 157.7 కిలోమీటర్ల బాల్ ఫాస్టెస్ బౌలింగ్ రికార్డ్‌గా నమోదైంది. ఇప్పటి వరకు ఈ రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేదు. అతని తర్వాత లాకీ ఫెర్గూసన్ 157.3 కిలోమీటర్ల వేగంతో 2022 సీజన్‌లో ఫాస్టెస్ట్ బాల్ వేసాడు. ఉమ్రాన్ మాలిక్( 157), మయాంక్ యాదవ్ (156.7), అన్రిచ్ నోర్జ్(156.2) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

బిత్తరపోయిన మ్యాక్సీ..
ఈ మ్యాచ్‌లో మయాంక్ యాదవ్ ధాటికి ఆర్‌సీబీ బ్యాటర్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్(0), కామెరూన్ గ్రీన్(9) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. మయాంక్ ఫాస్టెస్ట్ డెలివరీకి మ్యాక్స్‌వెల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. కామెరూన్ గ్రీన్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మయాంక్ యాదవ్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

లక్నో ఘన విజయం..
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33), రజత్ పటీదార్(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్(3/14) మూడు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించగా.. సిద్దార్థ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, April 2, 2024, 23:33 [IST]
Other articles published on Apr 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+