Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: నిప్పులు చెరిగిన మయాంక్ యాదవ్.. బిత్తరపోయిన ఆర్‌సీబీ బ్యాటర్లు! (వీడియో)

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ మయాంక్ యాదవ్ నిప్పులు చెరిగాడు. గంటకు 157 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించి ఈ సీజన్‌లోనే ఫాస్టెస్ట్ డెలివరీ రికార్డు అందుకున్నాడు.

మయాంక్ యాదవ్ ధాటికి ఆర్‌సీబీ బ్యాటర్లు గ్లేన్ మ్యాక్స్‌వెల్(0), కామెరూన్ గ్రీన్(9) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. మయాంక్ ఫాస్టెస్ట్ డెలివరీకి మ్యాక్స్‌వెల్ కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. కామెరూన్ గ్రీన్(9) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మయాంక్ వేసిన 6వ ఓవర్ నాలుగో బంతికి మ్యాక్స్‌వెల్‌.. పూరన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

RCB vs LSG Mayank Yadav s fast bowling stuns Glenn Maxwell and Cameron Green in IPL 2024 match

151 కిలోమీటర్ల వేగంతో వేసిన షార్ట్ ఆఫ్ లెంగ్త్ బాల్‌ను మ్యాక్స్‌వెల్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి బ్యాట్‌ను తాకుతూ కీపర్ చేతిలో పడింది. తన మరుసటి ఓవర్‌లో నాలుగో బంతికే కామెరూన్ గ్రీన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ దిశగా వేసిన బంతి గ్రీన్ బ్యాట్‌ను మిస్సై వికెట్‌ను లేపేసింది. ప్రస్తుతం మయాంక్ యాదవ్ బౌలింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

ఆర్‌సీబీ బౌలర్లలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ రెండు వికెట్లు తీయగా..టోప్లీ, యశ్ దయాల్, సిరాజ్ తలో వికెట్ తీసారు. ఆర్‌సీబీ బౌలర్ల పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్‌ లక్నో సూపర్ జెయింట్స్‌కు కలిసొచ్చింది.

Story first published: Tuesday, April 2, 2024, 22:36 [IST]
Other articles published on Apr 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+