Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: టాస్ గెలిచిన లక్నో.. ఆర్‌సీబీ షాకింగ్ నిర్ణయం!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం ఉండనున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ తెలిపాడు. ఇక్కడి గత చరిత్ర కూడా చేజింగ్‌కు అనూకలంగా ఉందని చెప్పాడు. సింపుల్‌గా ఉంటూ స్ట్రైట్‌ ఫార్వా‌డ్‌గా ఆడటమే తమ ప్రణాళికని తెలిపాడు.

ఇప్పటికీ చిన్నస్వామి స్టేడియం తనకు హోమ్ గ్రౌండని, ఇక్కడే తాను క్రికెటర్‌గా ఎదిగానని చెప్పాడు. సీఎస్‌కే‌తో 220 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించేంత పనిచేశామని తెలిపాడు. ఇక్కడి క్రౌడ్ హోమ్ టీమ్‌కు మద్దతుగా ఉంటుందని చెప్పాడు. జట్టులో మార్పులు చేశామని మార్క్ వుడ్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

kl rahul faf du plessis ipl

ఇక పిచ్ కాస్త డ్రైగా ఉందని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. టాస్ గెలిస్తే ఏం చేయాలనేది 50-50గా ఉండేనని, లాస్ట్ టైమ్ చేజింగ్ చేశామని, ఈ సారి ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపాడు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగుతున్నామని చెప్పిన ఫాఫ్.. లక్నో సవాల్‌ను స్వీకరిస్తున్నామని చెప్పాడు.

హసరంగా అందుబాటులోకి వచ్చినా.. ఆర్‌సీబీ పార్నెల్‌తో బరిలోకి దిగింది. హసరంగాను కాకుండా పార్నెల్‌తో బరిలోకి దిగడంతో అభిమానులు అవాక్కయ్యారు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రార్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, అనూజ్ రావత్, డేవిడ్ విల్లే, వ్యాన్ పార్నెల్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినీస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనాద్కత్, అమిత్ మిశ్రా, ఆవేశ్ ఖాన్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్

Story first published: Monday, April 10, 2023, 19:20 [IST]
Other articles published on Apr 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+