Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ సిక్సర్.. మైదానం బయటపడ్డ బంతి! (వీడియో)

బెంగళూరు: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ సిక్సర్ బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఫీట్ సాధించాడు. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్‌లో ఫాఫ్ డుప్లెసిస్ ఈ రికార్డు అందుకున్నాడు.

ఈ ఓవర్‌ నాలుగో బంతిని 115 మీటర్ల దూరంలో స్డేడియం బయట పడేసాడు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద సిక్సర్‌గా నిలిచిపోయింది. రవి బిష్ణోయ్‌ చేతి నుంచి జారిపోయిన ఈ బంతిని ఫాఫ్ డుప్లెసిస్ గుంజి కొట్టాడు. అతని ధాటికి బంతి మైదానం బయట పడింది. ఈ బంతికి ముందు కూడా ఫాఫ్ సిక్స్‌ బాదగా.. ఆఖరి బంతిని మ్యాక్స్‌వెల్ సిక్స్ కొట్టాడు.

faf du plessis six rcb

ఫాఫ్ భారీ సిక్సర్‌ను చూసి నాన్ స్ట్రైకర్ గ్లేన్ మ్యాక్స్‌వెల్ అవాక్కయ్యాడు. ఈ భారీ సిక్సర్‌‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు.

భారీ లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్.. ఆదిలోనే వికెట్ కోల్పోయింది. సిరాజ్ సూపర్ బౌలింగ్‌కు విధ్వంసకర బ్యాటర్ కైల్ మేయర్స్(0) డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

Story first published: Monday, April 10, 2023, 22:11 [IST]
Other articles published on Apr 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+