Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: ఆ రెండు తప్పిదాలు మా ఓటమిని శాసించాయి: ఫాఫ్ డుప్లెసిస్

లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్స్ క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్‌లు ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం తమ ఓటమిని శాసించిందని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ఈ రెండు క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు.

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఆర్‌సీబీ 28 పరుగుల తేడాతో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైంది.

ఈ మ్యాచ్‌లో 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్వింటన్ డికాక్, 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పూరన్ ఇచ్చిన క్యాచ్‌లను ఆర్‌సీబీ వదిలేసింది. దాంతో ఈ ఇద్దరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో లక్నోకు భారీ లక్ష్యాన్ని అందించారు.

Faf du Plessis says

ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ఫాఫ్ డుప్లెసిస్.. డికాక్, పూరన్ క్యాచ్‌లు వదిలేయడంతో పాటు లక్నో యువ పేసర్ మయాంక్ యాదవ్ సంచలన బౌలింగ్‌.. తమ విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు.

'క్వింటన్ డికాక్, నికోలస్ పూరన్ ఇచ్చిన క్యాచ్‌లను నేలపాలు చేయడం మా విజయవకాశాలను దెబ్బతీసింది. మయాంక్ యాదవ్ అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. కొత్త బౌలర్లను ఎదుర్కోవడం చాలా కష్టం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ అతని బౌలింగ్ ఆడి ఉండటం కాబట్టి తబడటం సహజం.

కానీ మయాంక్ యాదవ్ పేస్‌తో పాటు కట్టుదిట్టమైన బంతులతో ఇబ్బంది పెట్టాడు. లైన్ అండ్ లెంగ్త్ కంట్రోల్ చేసే విధానం, క్రమశిక్షణగా బౌలింగ్ చేయడం అద్భుతం. పేస్‌తో పాటు ఖచ్చితత్వంతో కూడిన అతని బంతులు ఆడటం బ్యాటర్లకు ఇబ్బందిగా మారింది. ఈ రోజు మేం మా స్థాయికి తగ్గట్లు బౌలింగ్ చేయలేదు.

పవర్ ప్లేలోనే చాలా తప్పిదాలు చేశాం. సునాయస బౌండరీలు ఇచ్చాం. డెత్ ఓవర్స్‌లో కీలకంగా రాణించి మ్యాచ్ రేసులో నిలిచాం. కానీ పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకున్నాం. సరైన భాగస్వామ్యాలు నమోదు కాకపోవడంతో ఓటమి తప్పలేదు. ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురిచేసింది. తదుపరి మ్యాచ్‌ల్లో సత్తా చాటే ప్రయత్నం చేస్తాం.'అని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(56 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లతో 81) విధ్వంసకర బ్యాటింగ్‌తో రాణించగా.. చివర్లో నికోలస్ పూరన్(21 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 40 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్(13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 33), రజత్ పటీదార్(21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 29) మినహా మరే బ్యాటర్ రాణించలేదు. లక్నో బౌలర్లలో మయాంక్ యాదవ్(3/14) మూడు వికెట్లతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించగా.. సిద్దార్థ్, నవీన్ ఉల్ హక్, యశ్ ఠాకూర్, మార్కస్ స్టోయినీస్ తలో వికెట్ తీసారు.

Story first published: Tuesday, April 2, 2024, 23:58 [IST]
Other articles published on Apr 2, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+