Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG: అలా చేస్తేనే బ్యాటర్ల తిక్క కుదురుతోంది.. బెన్ స్టోక్స్ కొత్త ప్రతిపాదన!

హైదరాబాద్: బౌలర్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ క్రీజును ధాటితే రనౌట్ చేయవచ్చని క్రికెట్ నింబంధనలను రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్‌(ఎంసీసీ) స్పష్టం చేసింది. గతంలో ఈ తరహా ఔట్‌ను మన్కడింగ్‌గా పిలిచేవారు. మన్కడింగ్ చేయడం నిబంధనల్లో ఉన్నా.. దాన్ని అనైతికంగా భావించేవారు.

ఐపీఎల్ 2019లో రవి చంద్రన్ అశ్విన్.. జోస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడంతో ఈ నిబంధనపై తీవ్ర దుమారం రేగింది. క్రికెట్ ప్రపంచం రెండు వర్గాలు విడిపోయింది. కొందరు నైతికం అంటే.. మరికొందరు కాదని విమర్శించారు. ఈ క్రమంలోనే ఎంసీసీ మన్కడింగ్ ఔట్‌ను రనౌట్‌గా పరిగణించాలని స్పష్టం చేస్తూ.. ఇది నైతికమైనదేనని స్పష్టం చేసింది.

Ben Stokes

అయితే ఈ తరహా విధానంతో నాన్ స్ట్రైకర్‌ను రనౌట్ చేసినప్పుడల్లా విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ సందర్భంగా లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య జరిగిన మ్యాచ్‌తో మరోసారి మన్కడింగ్ వ్యవహారం చర్చనీయాంశమైంది.
ఆసాంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో లక్నో విజయానికి చివరి బంతికి ఒక్క పరుగు అవసరం కాగా.. బౌలర్ హర్షల్ పటేల్ బంతి వేయకముందే నాన్ స్ట్రైకర్ పరుగు కోసం క్రీజు ధాటాడు. ఇది గమనించిన హర్షల్ పటేల్ రనౌట్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బౌలింగ్ యాక్షన్ పూర్తయ్యేలోపు అతను రెండు సార్లు వికెట్లను కొట్టే ప్రయత్నం చేయడంతో అంపైర్ ఔటివ్వలేదు.

ఇలా రెండు సార్లు ప్రయత్నించడం నిబంధనలకు విరుద్దమని స్పష్టం చేశాడు. చివరి బంతికి పరుగు తీసి లక్నో విజయం సాధించగా.. హర్షల్ పటేల్ మన్కడింగ్ చేయకుండా పెద్ద తప్పు చేశాడని ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన హర్షా భోగ్లే.. ఈ తరహా రనౌట్‌ను వ్యతిరేకించేవారిని తనదైన శైలిలో సూటిగా ప్రశ్నించాడు.

'రవి భిష్ణోయ్ బంతి వేయకముందే క్రీజుని దాటేశాడు. ఇప్పటికీ నాన్‌ స్ట్రైయికింగ్ ఎండ్‌లో రనౌట్ చేయకూడదని చెప్పే సిల్లీ పీపుల్ ఉన్నారా?' హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. దీనికి ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్స్ స్పందించాడు.

'నువ్వేం అనుకుంటున్నావ్ హర్ష భోగ్లే? ఒకవేళ నాన్ స్ట్రైయికర్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్, బాల్ వేయకముందే క్రీజు దాటి అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రయత్నిస్తే. అంపైర్లు 6 పెనాల్టీ పరుగులు ఇవ్వాలి. ఇలా చేస్తే బ్యాటర్లు బాల్ వేసే దాకా క్రీజులోనే ఉంటారు. ఎలాంటి వివాదాలు ఉండవు.'అని బెన్ స్టోక్స్ కొత్త ప్రతిపాదన చేశాడు. ఇలా చేసినా బాగానే ఉంటుందని, బ్యాటర్ల తిక్క కుదురుతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

Story first published: Tuesday, April 11, 2023, 16:58 [IST]
Other articles published on Apr 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+