Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs LSG మ్యాచ్‌లో మెరిసిన బాలీవుడ్ బ్యూటీ!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)- లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ) మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. ముందుగా ఆర్‌సీబీ బ్యాటర్లు దుమ్మురేపగా.. చేజింగ్‌లో లక్నో బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ఓ వైపు సిక్సర్ల వర్షంతో తడిచి ముద్దయిన అభిమానులకు.. బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ వైట్ డ్రెస్‌లో తళక్కుమన్నది.

ఆర్‌సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అయిన అనుష్క శర్మ ఈ సీజన్‌లో మ్యాచ్‌కు హాజరవ్వడం ఇదే తొలిసారి. దాంతో టీవీ కెమెరాలన్నీ ఆమెనే ఫోకస్ చేశాయి. ఆర్‌సీబీ బ్యాటింగ్ సందర్భంగా కనిపించిన అనుష్క శర్మ.. ఫీల్డింగ్ తరఫున కనిపించింది. తన భర్త టీమ్‌కు మద్దతు తెలిపింది. వికెట్ తీసినప్పుడల్లా ఎగిరి గంతేసింది.

anushka sharma ipl match

ఆమెకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అనుష్క శర్మ మ్యాచ్‌కు రాగా.. కూతురు వామికా మాత్రం కనిపించలేదు. ఆమెను రూమ్‌లోనే ఉంచి అనుష్క మ్యాచ్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అనుష్క శర్మ.. కోహ్లీ ఆడే మ్యాచ్‌లకు హాజరవ్వడం ఇదే తొలిసారి కాదు. పెళ్లి అవ్వక ముందునుంచే అనుష్క మ్యాచ్‌లకు హాజరయ్యేది. ఐపీఎల్ సమయంలోనూ మొత్తం కోహ్లీతోనే ఉండేది.

ఈసారే కాస్త ఆలస్యంగా అనుష్క మైదానంలో కనిపించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆర్‌సీబీ టాప్-3 బ్యాటర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(44 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 79 నాటౌట్), గ్లేన్ మ్యాక్స్‌వెల్(29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 59) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.

లక్నో బౌలర్లలో అమిత్ మిశ్రా, మార్క్ వుడ్ తలో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 105 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సిరాజ్, వాయ్‌నే పార్నెల్ రెండేసి వికెట్లు తీయగా.. ఇంపాక్ట్ ప్లేయర్ కర్ణ్ శర్మ ఓ వికెట్ పడగొట్టాడు.

మార్కస్ స్టోయినిస్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65) విధ్వంసకర బ్యాటింగ్‌తో వణికించాడు. కర్ణ్ శర్మ అతన్ని ఔట్ చేయగా.. క్రీజులోకి నికోలస్ పూరన్, బదోని ఉన్నారు.

Story first published: Monday, April 10, 2023, 22:57 [IST]
Other articles published on Apr 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+