బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. 'ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. చిన్నస్వామిలో ఈవ్‌నింగ్ మ్యాచ్ అంటే ఎవరైనా చేజింగ్‌కే మొగ్గు చూపుతారు.
గత మ్యాచ్‌ల్లో ఇక్కడ మేం అద్భుతంగా చేజ్ చేశాం. తాత్కలిక కెప్టెన్సీ అనేది అనూహ్యంగా వచ్చింది. నా కెప్టెన్సీలో జట్టు విజయాలు అందుకోవడం సంతోషంగా ఉంది. మరోసారి ఫాఫ్ డుప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్‌గానే బరిలోకి దిగనున్నాడు. తదుపరి మ్యాచ్‌కు అతను అందుబాటులోకి వస్తాడనుకుంటున్నా. ఇదో అద్భుతమైన పిచ్. ఎప్పటిలా ఉండే చిన్నస్వామి వికెటే అని అనుకుంటున్నాం.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు.

లీగ్ సెకండ్ ఫేజ్ ప్రారంభమైందని, ప్రతీ మ్యాచ్ గెలవడం తమకు ముఖ్యమని కేకేఆర్ సారథి నితీశ్ రాణా అన్నాడు. 'ఈ టోర్నీలో మేం కొంతమేరకు అద్భుతంగా ఆడితే మరికొంత చెత్త ప్రదర్శన చేశాం. ఇప్పుడు విజయాలను మాత్రమే కొనసాగించాల్సిన సమయం ఆసన్నమైంది. సమష్టిగా రాణిస్తే ఫలితాలు మాకు అనుకూలంగా ఉంటాయి.
గత మ్యాచ్‌లో తప్పనిసరి పరిస్థితుల్లో మార్పులు చేయాల్సి వచ్చింది. ఫిట్‌నెస్ సమస్యలతో శార్దూల్ ఠాకూర్, గుర్భాజ్ జట్టుకు దూరమయ్యారు. గత మ్యాచ్‌లోని తుది జట్టులో ఒక మార్పు చేశాం. కుల్వాంత్ స్థానంలో వైభవ్ అరోరా బ్యాటింగ్ చేయనున్నాడు.'అని నితీశ్ రాణా చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
కేకేఆర్: నారయణ్ జగదీషన్, జాసన్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా(కెప్టెన్), రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, డేవిడ్ విల్లే, వైభవ్ అరోరా, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ(కెప్టెన్), షెహ్‌బాజ్ అహ్మద్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్(కీపర్), సుయాశ్ ప్రభుదేశాయ్, వానిందు హసరంగా, డేవిడ్ విల్లే, విజయ్‌కుమార్ వైశాఖ్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్