Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

బెంగళూరు: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తాత్కలిక కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఒక్క చిన్నస్వామి స్టేడియం‌లోనే 3000 పరుగులు పూర్తి చేసుకున్న కోహ్లీ.. టీ20ల్లో ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.

కోహ్లీ తర్వాత ఓ వేదికపై అత్యధిక పరుగులు చేసిన టీ20 బ్యాటర్‌గా ముష్ఫికర్ రహీమ్ నిలిచాడు. అతను షేర్ బంగ్లా వేదికగా 2980 పరుగులు చేశాడు.కేకేఆర్‌తో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదిన కోహ్లీ(37 బంతుల్లో 6 ఫోర్లతో 54) ఈ సీజన్‌లో 300 పరుగులు మార్క్ అందుకున్న తొలి భారత ప్లేయర్‌గా నిలిచాడు.

 RCB vs KKR:

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, కోహ్లీ మినహా మరే ప్లేయర్ కూడా ఐదు హాఫ్ సెంచరీలు నమోదు చేయలేదు. ఆరెంజ్ క్యాప్ జాబితాలో ఫాఫ్ డుప్లెసిస్ 432 పరుగులతో టాప్‌లో ఉండగా.. డెవాన్ కాన్వే, విరాట్ కోహ్లీ తర్వాతి స్థానాల్లో నిలిచారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. జాసన్ రాయ్(29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), నితీశ్ రాణా(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) రాణించగా..రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(17), షెబాజ్ అహ్మద్(2), గ్లేన్ మ్యాక్స్‌వెల్(5) విఫలమవ్వగా.. మహిపాల్ లోమ్రోర్(18 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 34) సాయంతో కోహ్లీ జట్టును ఆదుకున్నాడు. 55 పరుగుల భాగస్వామ్యం అనంతరం లోమ్రోర్‌ను వరుణ్ చక్రవర్తీ ఔట్ చేయగా.. కోహ్లీని రస్సెల్ పెవిలియన్ చేర్చాడు.

Story first published: Wednesday, April 26, 2023, 22:49 [IST]
Other articles published on Apr 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+