Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: కుండపోత వర్షం.. టాస్ ఆలస్యం!

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ), కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ప్రారంభం కావాల్సిన మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. ప్రస్తుతం మైదానంలో కుండపోత వర్షం కురుస్తోంది. దాంతో ఇంకా టాస్ వేయలేదు. మైదానాన్ని గ్రౌండ్స్‌మెన్ కవర్లతో కప్పేసారు. మధ్యలో కాస్త బ్రేక్ ఇచ్చిన వర్షం.. మళ్లీ భారీగా పడుతోంది. దాంతో ఈ మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. రద్దయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.

5 ఓవర్లు ఆడితేనే..
అరేబియా సముద్రంలో అల్పపీడనం కారణంగా గత నాలుగు రోజులుగా బెంగళూరులో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళలో వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ వర్షం ఆగినా.. మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవచ్చు. గత నాలుగు రోజులుగా వర్షం పడుతుండటంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్తడిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉండటం కలిసొచ్చే అంశం. మళ్లీ వర్షం రాకుండా వర్షం పూర్తిగా ఆగి పోతేనే మ్యాచ్ సాధ్యమవుతోంది. రూల్స్ ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్లు ఆడితేనే మ్యాచ్ ఫలితాన్ని డీఎల్ఎస్‌ పద్దతిన తేల్చుతారు. మ్యాచ్ నిర్వహించే అవకాశాలు ఉంటే కటాఫ్ సమయం వరకు వేచి చూస్తారు. లేదంటే ముందే తుది నిర్ణయాన్ని వెల్లడిస్తారు.

RCB vs KKR Toss delayed due to heavy rain in Bengaluru

మ్యాచ్ రద్దయితే..
ఒకవేళ ఈ మ్యాచ్ రద్దయితే కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. మరోవైపు ఆర్‌సీబీ అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్‌ను దక్కించుకుంటుంది. ప్రస్తుతం ఆర్‌సీబీ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు16 పాయింట్స్‌తో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్‌తో మ్యాచ్ రద్దయితే ఆర్‌సీబీ ఖాతాలో ఒక పాయింట్ చేరుతుంది. అప్పుడు 17 పాయింట్స్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతోంది. కాకపోతే ఆ జట్టు టాప్-2 ప్లేస్‌లో నిలవాలంటే చివరి రెండు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది.

కేకేఆర్ సంక్లిష్టం..
కేకేఆర్ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలు, ఓ మ్యాచ్ రద్దుతో 11 పాయింట్స్‌తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. తాజా మ్యాచ్ రద్దయితే ఆ జట్టు ఖాతాలో ఓ పాయింట్ చేరి 12 పాయింట్స్‌ దక్కించుకుంటుంది. ఆఖరి మ్యాచ్ గెలిచినా 14 పాయింట్స్ ఖాతాలో ఉంటాయి. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్‌పై ప్లే ఆఫ్స్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కేకేఆర్ రన్‌రేట్ 0.193 కూడా గొప్పగా లేదు.

Story first published: Saturday, May 17, 2025, 20:17 [IST]
Other articles published on May 17, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+