Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: కొంపముంచిన సునీల్ నరైన్.. కేకేఆర్ చేతిలో ఆర్‌సీబీ ఘోర పరాజయం!

ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) వరుసగా రెండో విజయాన్ని సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో బెంగళూరులోని చినస్వామి స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 182 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 83) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కామెరూన్ గ్రీన్(21 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33), గ్లేన్ మ్యాక్స్‌వెల్(19 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28) రాణించారు.

RCB vs KKR Sunil Narine Venkatesh Iyer take Kolkata to a convincing win in IPL 2024

చివర్లో దినేశ్ కార్తీక్(8 బంతుల్లో 3 సిక్స్‌లతో 20) మెరుపులు మెరిపించాడు. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా, ఆండ్రీ రస్సెల్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఓ వికెట్ పడగొట్టాడు.

ట్రెండ్‌కు కేకేఆర్ బ్రేక్..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన కేకేఆర్ 16.5 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసి సునాయస విజయాన్ని అందుకుంది. వెంకటేశ్ అయ్యర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50 ) హాఫ్ సెంచరీతో రాణించగా.. సునీల్ నరైన్(22 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 47), ఫిల్ సాల్ట్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30), శ్రేయస్ అయ్యర్(24 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

ఆర్‌సీబీ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాఖ్, మయాంక్ దగర్,, యశ్ దయాల్ తలో వికెట్ తీసారు. సొంతగడ్డపై ఐపీఎల్ జట్లు సాధిస్తున్న విజయాల పరంపరకు కేకేఆర్ బ్రేక్ వేసింది. సొంతగడ్డపై ఆర్‌సీబీని చిత్తు చేసింది. చిన్నస్వామి స్టేడియంలో కేకేఆర్‌కు ఇది 6వ విజయం.

నరైన్ విధ్వంసం..
ఫిల్‌ సాల్ట్‌తో ఓపెనింగ్ చేసిన సునీల్ నరైన్ రెచ్చిపోయాడు. భారీ సిక్స్‌లో ఆర్‌సీబీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫిల్ సాల్ట్ సైతం ధాటిగా ఆడటంతో పవర్ ప్లేలోనే కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన సునీల్ నరైన్‌ను మయాంక్ దగర్ క్లీన్ బౌల్డ్ చేసాడు. ఆ వెంటనే ఫిల్ సాల్ట్‌ను విజయ్ కుమార్ వైశాఖ్ ఔట్ చేశాడు.

అయితే ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. వెంకటేశ్ అయ్యర్‌ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 10 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్ లెగ్‌లో యశ్ దయాల్ నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో శ్రేయస్ అయ్యర్ చెలరేగాడు. మరోవైపు వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతన్ని యశ్ దయాల్ ఔట్ చేసినా.. రింకూ సింగ్‌తో కలిసి అయ్యర్ భారీ సిక్సర్‌తో విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

Story first published: Friday, March 29, 2024, 22:57 [IST]
Other articles published on Mar 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+