For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs KKR: శభాష్ షెబాజ్ అహ్మద్.. ఆండ్రీ రస్సెల్‌పైనే రివేంజ్ తీసుకున్న ఆర్‌సీబీ చిన్నోడు!

ముంబై: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) యువ ఆల్‌రౌండర్ షెబాజ్ అహ్మద్ అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్ షెబాజ్ బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. మూడు భారీ సిక్స్‌లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో(0/16) విఫలమైనా బ్యాటింగ్‌లో సత్తా చాటాడు. లో స్కోరింగ్ చేజింగ్‌లో కీలక సమయంలో బ్యాట్ ఝులిపించి జట్టుపై ఉన్న ఒత్తిడిని తగ్గించాడు. 20 బంతుల్లో 3 సిక్సర్లతో 27 పరుగులు చేశాడు. ఈ క్రమంలో కేకేఆర్ హిట్టర్, వెస్టిండీస్ విధ్వంసకర వీరు ఆండ్రీ రస్సెల్‌పై రీవెంజ్ తీసుకున్నాడు. తన ఓవర్‌లో రస్సెల్ రెండు సిక్స్‌లు బాదగా.. అతని ఓవర్‌లో షెబాజ్ సైతం రెండు సిక్స్ బాది ప్రతీకారం తీర్చుకున్నాడు.

రస్సెల్ విధ్వంసతో ఒక్క ఓవర్‌కే పరిమితమైన షెబాజ్.. అతని ధాటి వైడ్‌తో సహా 16 పరుగులు సమర్పించుకున్నాడు. కేకేఆర్ ఇన్నింగ్స్ సందర్భంగా షెబాజ్ అహ్మద్ వేసిన 13వ ఓవర్‌లో రస్సెల్.. డీప్ మిడ్ వికెట్ మీదుగా.. లాంగాఫ్‌లో భారీ సిక్స్‌లు బాదాడు. యాదృశ్చికమో ఏమో కానీ.. ఆర్‌సీబీ ఇన్నింగ్స్ సందర్భంగా రస్సెల్ వేసిన 13వ ఓవర్‌లోనే రెండు భారీ సిక్స్‌లు బాది రివేంజ్ తీసుకున్నాడు. కాకపోతే రస్సెల్ రెండు, నాలుగో బంతిని సిక్సర్‌గా తరలిస్తే.. షెబాజ్ మూడు, ఐదో బంతులను మైదానం బయటికి తరలించాడు. ప్రస్తుతం ఇదే విషయాన్ని నెటిజన్లు ప్రస్తావిస్తున్నారు. శభాష్ షెబాజ్ అంటూ ప్రశంసిస్తున్నారు. పర్‌ఫెక్ట్ రివేంజ్ తీసుకున్నావంటూ కొనియాడుతున్నారు.

ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్వల్ప లక్ష్య చేధనను సులువుగా చేధిస్తుందనకున్న బెంగళూరుకు కేకేఆర్ బౌలర్లు గట్టి పోటీనిచ్చారు. ఆఖరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడారు. దాంతో అనేక మలుపు తిరిగిన మ్యాచ్ దినేశ్ కార్తీక్ సూపర్ సిక్స్‌తో ఆర్‌సీబీ వశమైంది

Shahbaz Ahmed takes

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. ఆర్‌సీబీ అత్యధిక ధర ఆటగాళ్లు వానిందు హసరంగా(4/20), హర్షల్ పటేల్(2/11) కేకేఆర్ పతనాన్ని శాసించారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రస్సెల్(25), ఉమేశ్ యాదవ్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. షెబాజ్ అహ్మద్(20 బంతుల్లో 3 సిక్స్‌లతో 27), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(40 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దినేశ్ కార్తీక్((7 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

Story first published: Thursday, March 31, 2022, 7:35 [IST]
Other articles published on Mar 31, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+