Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: రాహుల్ త్రిపాఠి స్టన్నింగ్ క్యాచ్.. బిత్తరపోయిన కోహ్లీ!(వీడియో)

RCB vs KKR: Rahul Tripathi grabs a stunning catch running behind to dismiss Virat Kohli
IPL 2021 : Rahul Tripathi Stunning Catch To Dismiss Virat Kohli || Oneindia Telugu

చెన్నై: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ప్లేయర్ రాహుల్ త్రిపాఠి తన సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. అతని స్టన్నింగ్ క్యాచ్‌కు ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(5) నిరాశగా పెవిలియన్ చేరాడు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌ సెకండ్ బాల్‌ను పవర్ ప్లే ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్‌తో బౌండరీ తరలించాలనుకున్న కోహ్లీ ప్రయత్నం బెడిసికొట్టింది. ఓవర్ కవర్స్ మీదుగా అతను ఆడిన భారీ షాట్‌ను రాహుల్ తిప్రాఠి అద్భుతంగా అందుకున్నాడు. వెనక్కి పరుగెత్తుతూ డైవ్ చేసి మరి బంతిని ఒడిసి పట్టుకున్నాడు.

ఈ స్టన్నింగ్ క్యాచ్‌కు విరాట్ బిత్తరపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మరో బ్యాట్స్‌మన్‌ రజత్‌ పటిదార్(1)ను ఆఖరి బంతికి బౌల్డ్‌ చేసిన వరుణ్ చక్రవర్తి.. బెంగళూరును దెబ్బకొట్టాడు.

దాంతో ఆర్‌సీబీ 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. కానీ ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మ్యాక్స్‌వెల్(49 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 78) తన ఫామ్‌ను కొనసాగిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన మ్యాక్సీ.. ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌తో కలిసి 86 రన్స్, ఏబీడితో కలిసి నాలుగో వికెట్ 53 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి వెనుదిరిగాడు. దాంతో ఆర్‌సీబీ భారీ స్కోర్ చేయగలిగింది.

Story first published: Sunday, April 18, 2021, 17:17 [IST]
Other articles published on Apr 18, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+