
ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లైన్ లెంగ్త్‌తో కేకేఆర్ బ్యాట్స్‌మన్‌ను ఇబ్బంది పెట్టాడు. తొలి ఓవర్‌లోనే కేకేఆర్ ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ ఔట్ చేసినంత పనిచేసిన సిరాజ్.. రెండో ఓవర్‌లో సిరాజ్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ చేజార్చాడు. వెంకటేశ్ అయ్యర్ ఆడిన బంతి వికెట్‌కు రెప్పపాటు దూరంలో ఆగిపోగా.. అయ్యర్ ఇచ్చిన క్యాచ్ చేజారింది. అయితే సెకండ్ ఓవర్‌లో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో కలిసి సిరాజ్ సూపర్ ప్లాన్ రచించాడు. షార్ట్ పిచ్ బాల్‌తో రహానేకు గాలం వేసాడు.
ఊరించేలాంటి షార్ట్ పిచ్ బాల్‌కు టెంప్ట్ అయిన రహానే భారీ సిక్సర్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అతను ఆడిన ఆ షాట్ నేరుగా.. డీప్ బ్యాక్‌వర్డ్ స్క్వేర్‌లో ఉన్న షబాజ్ అహ్మద్ చేతిలో పడింది. షబాజ్ కదలకుండా ఆ క్యాచ్ అందుకోగా.. రహానే(9) నిరాశగా పెవిలియన్ చేరాడు. ఇక పంజాబ్ కింగ్స్ చేతిలో ఎదురైన ఓటమితో గుణపాఠం నేర్చుకున్న ఆర్‌సీబీ.. పర్‌ఫెక్ట్ ప్లాన్‌తో కేకేఆర్‌తో మ్యాచ్‌కు వచ్చింది. టాస్ కూడా కలిసి రావడంతో ఫాప్.. తమ బౌలింగ్ ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తున్నాడు.
డేవిడ్ విల్లే, సిరాజ్‌తో ఆరంభంలో బౌలింగ్ చేయించి కేకేఆర్‌ను కట్టడి చేసిన ఫాఫ్ మధ్యలో ఆకాశ్ దీప్‌ను రంగంలోకి దింపి వికెట్లను రాబట్టాడు. విల్లే, సిరాజ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురైన కేకేఆర్ బ్యాట్స్‌మన్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో హిట్టింగ్ చేసే ప్రయత్నం చేశారు. దాంతో అతనికి వికెట్లు దక్కాయి. వెంకటేశ్ అయ్యర్(10), నితీశ్ రాణా(10)లు ఆకాశ్ దీప్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరారు.బౌండరీలతో జోరు కనబర్చిన శ్రేయస్ అయ్యర్‌కు వానిందు హసరంగాతో చెక్ పెట్టించారు. ఊరించే బంతితో అతన్ని క్యాచ్ ఔట్‌గా బోల్తా కొట్టించారు. దాంతో 46 పరుగులకే కేకేఆర్ 4 వికెట్లు కోల్పోయింది. క్రీజులో సామ్ బిల్లింగ్స్, సునీల్ నరైన్ ఉన్నారు.