RCB vs KKR: రఫ్ఫాడించిన ట్రిపుల్ ఆర్.. ఆర్‌సీబీ ముందు భారీ లక్ష్యం!
బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తేలిపోయారు. జాసన్ రాయ్(29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 56), నితీశ్ రాణా(21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 48) చెలరేగడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 200 పరుగులు చేసింది. చివర్లో రింకూ సింగ్(18 నాటౌట్), డేవిడ్ వైస్(12 నాటౌట్) మెరుపులు మెరిపించారు.
కేకేఆర్ ట్రిపుల్ ఆర్ జాసన్ రాయ్, నితీశ్ రాణా, రింకూ సింగ్ రఫ్ఫాడించారు. ఆర్‌సీబీ బౌలర్లలో హసరంగా, విజయ్ కుమార్ రెండేసి వికెట్లు తీయగా.. సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు ఓపెనర్లు జాసన్ రాయ్, నారయణ్ జగదీషన్(27) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ప్రారంభంలో ఆచితూచి ఆడిన ఈ జోడీ.. షెహ్‌బాజ్ అహ్మద్ బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, బౌండరీతో 25 పరుగులు పిండుకుంది. దాంతో పవర్ ప్లేలో కేకేఆర్ వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసింది. జాసన్ రాయ్ 22 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని విజయ్ కుమార్ వైశాఖ్ విడదీసాడు. ఒకే ఓవర్‌లో నారయణ్ జగదీషన్, జాసన్ రాయ్‌లను ఔట్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు నమోదైన 83 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు. అయితే 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నితీశ్ రాణా ఇచ్చిన సునాయస క్యాచ్‌ను సిరాజ్ నేలపాలు చేశాడు. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రాణా మరోసారి ఇచ్చిన క్యాచ్‌ను హర్షల్ పటేల్ నేలపాలు చేయడం ఆర్‌సీబీ కొంపముంచింది.
ఈ అవకాశాలతో రాణా విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగాడు. అతని జోరుకు హసరంగా ఎట్టకేలకు బ్రేక్ వేసాడు. విజయ్‌కుమార్ వైశాఖ్ సూపర్ క్యాచ్‌కు రాణా వెనుదిరిగాడు. ఇదే ఓవర్‌లోభారీ షాట్‌కు ప్రయత్నించిన వెంకటేశ్ అయ్యర్(31) కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్.. సిరాజ్ వేసిన 19వ ఓవర్‌లో వరుసగా 6, 4, 4 బాదాడు. కానీ ఈ ఓవర్ చివరి బంతికి డేంజరస్ రస్సెల్‌ను సిరాజ్ సూపర్ యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు.
హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్‌లో నమీబియా బ్యాటర్ డేవిడ్ వీస్(12 నాటౌట్) రెండు భారీ సిక్సర్లు బాదడంతో జట్టు స్కోర్ 200 మార్క్ అందుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications