
ముంబై: గత మ్యాచ్ పరాభావం నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) త్వరగానే తేరుకుంది. చెత్త బౌలింగ్‌తో పంజాబ్ కింగ్స్‌తో గెలిచే మ్యాచ్‌లో ఓడిన ఆర్‌సీబీ.. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బౌలింగ్‌లో దుమ్మురేపింది. రూ. 10 కోట్ల ఆటగాళ్లు వానిందు హసరంగా(4/20), హర్షల్ పటేల్(2/11) బంతితో చెలరేగడంతో కేకేఆర్.. 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. దాంతో ఆర్‌సీబీ ముందు 129 పరుగుల స్వల్ప లక్ష్యం నమోదైంది. తేమ ప్రభావం ఉండే సెకండ్ ఇన్నింగ్స్‌లో భీకర బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆర్‌సీబీకి ఈ టార్గెట్ పెద్ద కష్టం కాకపోవచ్చు. ఇక కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రస్సెల్(25), ఉమేశ్ యాదవ్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్(10) రిటర్న్ క్యాచ్ ఇవ్వగా.. ఆ కొద్దిసేపటికే సిరాజ్ బౌలింగ్ రహానే ఔటయ్యాడు. ఊరించే షార్ట్ పిచ్ బాల్‌కు టెంప్ట్ అయిన అతను షాబాజ్ అహ్మద్‌కు సునాయస క్యాచ్ ఇచ్చాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ చూడ చక్కని బౌండరీలు కొట్టడంతో కేకేఆర్ పవర్ ప్లేలో 3 వికెట్ల నష్టానికి 44 రన్స్ చేసింది. ఆ వెంటనే ఫాఫ్.. వానిందు హసరంగాను రంగంలోకి దించగా శ్రేయస్ అయ్యర్(13) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణా(10) భారీ సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. ఆకాశ్ దీప్ వేసిన ఆ ఓవర్‌లో మరో బౌండరీ బాదిన అతను.. డేవిడ్ విల్లే సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు. సునీల్ నరైన్ సైతం భారీ సిక్సర్, ఫోర్ బాది ఆశలు రేకెత్తించగా.. అతనికి హసరంగా బ్రేక్ వేశాడు. వరుస బంతుల్లో సునీల్ నరైన్‌తో పాటు షేల్డన్ జాక్సన్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. హర్షల్ పటేల్ తన ఫస్ట్ ఓవర్‌లోనే సామ్ బిల్లింగ్స్(14)ను ఔట్ చేయడంతో కేకేఆర్ 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. 100 పరుగులైనా చేస్తుందా? అనే సందేహం కలిగింది. కానీ ఆండ్రీ రస్సెల్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో జట్టు స్కోర్‌ను 100కు చేరువ చేశాడు. అతని జోరుకు హర్షల్ పటేల్ బ్రేక్ వేయగా.. టీమ్ సౌథీని వానిందు ఔట్ చేశాడు. చివర్లో ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ 27 పరుగులు జోడించడంతో కేకేఆర్ 128 పరుగులు చేసింది.