Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: హర్షల్ పటేల్‌ను ఊరిస్తున్న 8 ఏళ్ల రికార్డు! మరో మూడు వికెట్లు తీస్తే..

RCB vs KKR: Harshal Patel Can Create IPL History Today?

షార్జా: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ హర్షల్ పటేల్‌ను గత 8 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా నేడు(సోమవారం) మరికొద్దిసేపట్లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ప్రారంభమయ్యే క్వాలిఫయర్ మ్యాచ్‌లో హర్షల్ పటేల్ మూడు వికెట్లు తీస్తే ఒక సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు పొందుతాడు. తద్వారా చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ పేసర్ డ్వేన్ బ్రావో రికార్డును అధిగమిస్తాడు. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన హర్షల్ పటేల్ ఇప్పటికే 30 వికెట్లను పడగొట్టి పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. మరో రెండు వికెట్లు తీస్తే డ్వేన్ బ్రావో రికార్డును సమం చేస్తాడు.

తొలి భారత బౌలర్‌గా..

తొలి భారత బౌలర్‌గా..

2013 సీజన్‌లో డ్వేన్ బ్రావో 32 వికెట్లు పడగొట్టి ఈ ఘనతను అందుకున్నాడు. గత 8 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది. గతేడాది కగిసో రబడా.. 30 వికెట్లతో బ్రావో రికార్డుకు చేరువై తృటిలో మిస్సయ్యాడు. ఇప్పటికే 30 వికెట్లు తీసిన హర్షల్ పటేల్.. ఒక సీజన్‌లో అత్యధిక వికెట్ తీసిన తొలి బౌరత బౌలర్‌గా గుర్తింపు పొందాడు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్‌ను హర్షల్ పటేల్ వెనక్కు నెట్టాడు. ఐపీఎల్ 2020 సీజన్లో బుమ్రా 15 మ్యాచుల్లో 27 వికెట్లు తీయగా.. 2017లో భువనేశ్వర్ కుమార్14 మ్యాచులలో 26 వికెట్లు తీశాడు.

హోరా హోరీ..

హోరా హోరీ..

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడడం ఖాయం. ఈ మ్యాచులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇక ఆర్‌సీబీ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉండగా.. కేకేఆర్‌ మూడో టైటిల్‌పై కన్నేసింది. ఐపీఎల్ 2021 లీగ్‌ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో విజయం సాధించాయి. ఫస్టాఫ్‌లో ఆర్‌సీబీ గెలవగా.. సెకండాఫ్‌లో కేకేఆర్ విజయం సాధించింది. దాంతో నేటి పోరు ఆసక్తికరంగా సాగనుంది.

ఇరు జట్లు పటిష్టంగానే..

ఇరు జట్లు పటిష్టంగానే..

రెండు టీమ్స్ సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ ఆర్‌సీబీ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. ఈ సీజన్ తర్వాత ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విరాట్ కోహ్లీకి ఈ పోరు చాలా ప్రతిష్టాత్మకం కానుంది. ఆర్‌సీబీకి టైటిల్ అందించాలన్న కల నెరవేరాలంటే ఈ ఎలిమినేటర్ టెస్ట్‌ను విరాట్ పాస్ అవ్వాల్సిందే. పడిక్కల్ మ్యాక్స్‌వెల్, భరత్ మరోసారి కీలకం కానున్నాడు. బౌలింగ్‌లో ఆర్‌సీబీకి పెద్దగా సమస్యల్లేవు. ఇక ఫస్టాఫ్‌లో తడబడిన నైట్‌రైడర్స్ యూఏఈ లెగ్‌లో అదరగొడుతుంది. వెంకంటేశ్ అయ్యర్ రాకతో బ్యాటింగ్ లైనప్ బలంగా తయారైంది. ఆండ్రీ రసెల్ అందుబాటులోకి వస్తే మిడిలార్డర్ బలం రెట్టింపు అవుతుంది. స్పిన్నర్లు నరైన్, చక్రవర్తి కీలకం కానున్నారు.

తుది జట్లు (అంచనా)

తుది జట్లు (అంచనా)

ఆర్‌సీబీ:

దేవ్‌దత్‌ పడిక్కల్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్‌ అహ్మద్, డేనియల్ క్రిస్టియన్‌, జార్జ్ గార్టన్‌, హర్షల్‌ పటేల్, మొహ్మద్ సిరాజ్‌, యుజ్వేంద్ర చహల్‌.

కేకేఆర్:

శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్/షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తీ, శివం మావి

Story first published: Monday, October 11, 2021, 18:09 [IST]
Other articles published on Oct 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+