Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs KKR: రస్సెల్‌కు నో చాన్స్.. ఆర్‌సీబీదే బ్యాటింగ్!

Unchanged Bangalore opt to bat, no Russell for Kolkata

షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ఎంచుకుంది. పిచ్ కొంచెం ఫ్లాట్‌గా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. అంతేకాకుండా షార్జాలో చేజింగ్ చేయడం కష్టమని పేర్కొన్నాడు. ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

ఇక టాస్ గెలిస్తే తాము బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఇయాన్ మోర్గాన్ పేర్కొన్నాడు. జట్టులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ బరిలోకి దిగుతాడని అంతా భావించినా అతనికి కేకేఆర్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వలేదు. ఇరు జట్లు విన్నింగ్ కాంబినేషన్‌తోనే బరిలోకి దిగుతున్నాయి.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పట్టాల్సిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడడం ఖాయం. ఈ మ్యాచులో గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-1లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఇక ఆర్‌సీబీ తొలి ఐపీఎల్‌ టైటిల్‌ వేటలో ఉండగా.. కేకేఆర్‌ మూడో టైటిల్‌పై కన్నేసింది. ఐపీఎల్ 2021 లీగ్‌ దశలో ఆడిన మ్యాచ్‌ల్లో రెండు జట్లు చెరో విజయం సాధించాయి. ఫస్టాఫ్‌లో ఆర్‌సీబీ గెలవగా.. సెకండాఫ్‌లో కేకేఆర్ విజయం సాధించింది. దాంతో ఈ ఎలిమినేటర్ పోరు ఆసక్తికరంగా సాగనుంది.

ఆర్‌సీబీ:
దేవ్‌దత్‌ పడిక్కల్, విరాట్ కోహ్లీ, కేఎస్ భరత్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, ఏబీ డివిలియర్స్‌, షాబాజ్‌ అహ్మద్, డానియల్ క్రిస్టియన్‌, జార్జ్ గార్టన్‌, హర్షల్‌ పటేల్, మమహ్మద్ సిరాజ్‌, యుజ్వేంద్ర చాహల్‌.

కేకేఆర్:
శుభ్‌మన్ గిల్, వెంకటేశ్ అయ్యర్, నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లూకీ ఫెర్గూసన్, వరుణ్ చక్రవర్తీ, శివం మావి

Story first published: Monday, October 11, 2021, 19:12 [IST]
Other articles published on Oct 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+