
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం తాము టాస్ గెలిస్తే బౌలింగే ఎంచుకునేవాళ్లమని చెప్పాడు. దాంతో ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? అనే సందేహం కలుగుతోంది. కోహ్లీ మాత్రం పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు. అంతేకాకుంగా షార్జాలో చేజింగ్ చేయడం కష్టమని, పైగా తమ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉందన్నాడు. భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు ఉంచితే మ్యాచ్‌లో విజయం సాధించవచ్చన్నాడు.
వాస్తవానికి ఈ సీజన్‌లో ఈ మైదానంలో జరిగిన అన్నీ మ్యాచ్‌లు చాలా సప్పగా సాగాయి. ఏ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్లు నమోదు కాలేదు. షార్జా అంటేనే సిక్సర్ల వర్షం కురుస్తుంది. అలాంటిది ఇప్పటి వరకు ఈ మైదానంలో 81 సిక్స్‌లు మాత్రమే వచ్చాయి. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు పిచ్ ఎంత నెమ్మదిగా ఉందోనని. అంతేకాకుండా ఈ వికెట్‌పై స్పిన్నర్లు దుమ్మురేపారు. పైగా కేకేఆర్ సగబలం ఆ జట్టు స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, సునీల్ నరైన్‌లే. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం కరెక్టేనా? అనే సందేహం అభిమానుల్లో ఆందోళన రేకెత్తిస్తుంది.
అయితే మ్యాచ్‌కు ముందు పిచ్‌ను విశ్లేషించిన కామెంటేటర్లు ఎంబాపే, మాథ్యూ హెడెన్ మాత్రం వికెట్ ఫ్లాట్‌గా ఉందని చెప్పారు. బ్యాటింగ్‌కు అనుకూలిస్తుందని, 170-180 స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయన్నారు. వికెట్ నేపథ్యంలోనే విరాట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. 180 ప్లస్ స్కోర్ చేస్తే ఆర్‌సీబీకి అవకాశాలుంటాయని, లేకపోతే కష్టమని విశ్లేషకులు అంటున్నారు. ఇక ఇరు జట్లు ఎలాంటి మార్పుల్లేకుండా తమ విన్నింగ్ కాంబినేషనన్స్‌తోనే బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్ బరిలోకి దిగుతాడని అంతా భావించినా అతనికి కేకేఆర్ మేనేజ్‌మెంట్ అవకాశం ఇవ్వలేదు.