RCB vs KKR: బెంగళూరు బోణీ.. ఉత్కంఠ మ్యాచ్‌లో సిక్సర్‌తో గెలిపించిన దినేశ్ కార్తీక్

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) తొలి విజయాన్నందుకుంది. కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్వల్ప లక్ష్య చేధనను సులువుగా చేధిస్తుందనకున్న బెంగళూరుకు కేకేఆర్ బౌలర్లు గట్టి పోటీనిచ్చారు. ఆఖరి ఓవర్ వరకు విజయం కోసం పోరాడారు. దాంతో అనేక మలుపు తిరిగిన మ్యాచ్ దినేశ్ కార్తీక్ సూపర్ సిక్స్‌తో ఆర్‌సీబీ వశమైంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్.. 18.5 ఓవర్లలో 128 పరుగులకు కుప్పకూలింది. ఆర్‌సీబీ అత్యధిక ధర ఆటగాళ్లు వానిందు హసరంగా(4/20), హర్షల్ పటేల్(2/11) కేకేఆర్ పతనాన్ని శాసించారు. కేకేఆర్ ఇన్నింగ్స్‌లో ఆండ్రీ రస్సెల్(25), ఉమేశ్ యాదవ్(18) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ 19.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. షెబాజ్ అహ్మద్(20 బంతుల్లో 3 సిక్స్‌లతో 27), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్(40 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు. చివర్లో దినేశ్ కార్తీక్((7 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 14 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

17 పరుగులకే మూడు వికెట్లు..
129 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. వరుసగా మూడు ఓవర్లలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఉమేశ్ యాదవ్ వేసిన ఫస్ట్ ఓవర్ మూడో బంతికి అనూజ్ రావత్(0) కీపర్ క్యాచ్‌గా వెనుదిరగ్గా.. సౌతీ వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ఫాఫ్ డుప్లెసిస్.. రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక వచ్చిరావడంతోనే బౌండరీతో జోరు కనబర్చిన కింగ్ కోహ్లీ ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్ తొలి బంతికి కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. ఔట్‌సైడ్ ఆఫ్ స్టంప్ బాల్‌ను వెంటాడి విరాట్ మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో ఆర్‌సీబీ 17 ఓవర్లకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకున్న రూథర్‌ఫోర్డ్, షెబాజ్..
ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన డేవిడ్ విల్లే(18), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ నిదానంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. లో టార్గెట్ కావడంతో భారీ షాట్లు ఆడకుండా క్విక్ సింగిల్స్‌తో స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లారు. క్రీజులోకి కుదురుకున్న ఈ జోడీని సునీల్ నరైన్ విడదీసాడు. డేవిడ్ విల్లేను ఔట్ చేసి 45 పరుగుల భాగస్వామ్యానికి తెరదించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షాబాజ్ అహ్మద్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. సునీల్ నరైన్ బౌలింగ్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదిన అతను.. వరుణ్ చక్రవర్తీ ఓవర్‌లో మరో సిక్సర్ కొట్టాడు. దాంతో ఆర్‌సీబీ 15.5 ఓవర్లలో 100 పరుగుల మార్క్ ధాటింది.

సిక్సర్‌తో ఫినీష్...
ఇక అదే జోరులో మరో సిక్సర్‌కు ప్రయత్నించిన షెబాజ్ స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులో కుదురుకున్న రుథర్ ఫోర్డ్ సైతం భారీ షాట్ ఆడే క్రమంలో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన హసరంగా బౌండరీ బాది అదే జోరులో క్యాచ్ ఔటయ్యాడు. దాంతో ఆర్‌సీబీ విజయానికి చివరి 12 బంతుల్లో 17 పరుగులు అవసరమయ్యాయి. వెంకటేశ్ అయ్యర్ వేసిన 19వ ఓవర్‌లో హర్షల్ పటేల్ రెండు బౌండరీలు బాదడంతో 9 పరుగులు వచ్చాయి. దాంతో చివరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా... రస్సెల్ వేసిన మొదటి బంతినే దినేశ్ కార్తీక్ భారీ సిక్సర్ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆ తర్వాతి బంతిని దినేశ్ కార్తీక్ స్ట్రైట్ డ్రైవ్ బౌండరీ బాదడంతో మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఆర్‌సీబీ విజయం లాంఛనమైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications