
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పంజాబ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 200 ప్లస్ స్కోర్ చేసినా తేమ కారణంగా ఓటమిపాలైన ఫాఫ్ డుప్లెసిస్ సారథ్యంలోని ఆర్‌సీబీ.. ఆ అనుభవంతో ఈ సారి చేజింగ్‌కు మొగ్గు చూపింది. పిచ్ గురించి పెద్దగా అవగాహన లేకున్నా.. తేమ ప్రభావం నేపథ్యంలో ఫీల్డింగ్ తీసుకుంటున్నానని టాస్ గెలిచిన అనంతరం డుప్లెసిస్ తెలిపాడు. ఎలాంటి మార్పులు లేకుండా సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.
ఇక శ్రేయస్ అయ్యర్ సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ ఎంచుకునేవాడినన్నాడు. సీఎస్‌కేతో జరిగిన గత మ్యాచ్ చివర్లో బంతి జారిందని తమ బౌలర్లు చెప్పారని, డ్యూ ప్రభావం ఉంటుందన్నాడు. గత మ్యాచ్‌లో బౌలర్లు, బ్యాటర్లు అదరగొట్టారని తెలిపాడు. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేయడం తమ ప్రతిభకు అసలు సిసలు సవాలన్నాడు. భారీ లక్ష్యాన్ని ముందుంచి విజయం కోసం ప్రయత్నిస్తామన్నాడు. జట్టులో ఒక మార్పు చేసామని, శివమ్ మావి స్థానంలో టీమ్ సౌథీ వచ్చాడన్నాడు.
తుది జట్లు(అంచనా)
ఆర్‌సీబీ: ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్, రుథర్ ఫోర్డ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, వానిందు హసరంగ, డేవిడ్ విల్లే, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్
కేకేఆర్: వెంకటేశ్ అయ్యర్, అజింక్యా రహానే, శ్రేయస్ అయ్యర్, నితీశ్ రాణా, జాక్సన్, సామ్ బిల్లింగ్స్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, టీమ్ సౌథీ, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ