Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Andre Russell ముందు పిల్ల చేష్టలా? గుంజి కొడితే బయటపడ్డది.. హసరంగా దిమ్మతిరిగింది!

 RCB vs KKR: Andre Russell hits a monstrous 96m SIX in Wanindu Hasaranga bowling

ముంబై: కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ ఆల్‌రౌండర్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఆండ్రీ రస్సెల్.. ఐపీఎల్ 2022 సీజన్‌‌ను ఘనంగా ఆరంభించాడు. టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకొని విఫలమైన వేళ.. రస్సెల్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వానిందు హసరంగా ఓవరాక్షన్‌తో చిర్రెత్తుకుపోయిన ఈ విండీస్ వీరుడు భారీ సిక్సర్‌తో అతనికి బుద్ది చెప్పాడు. ఇక సూపర్ బౌలింగ్‌తో వానిందు హసరంగా.. శ్రేయస్ అయ్యర్(13), సునీల్ నరైన్(12), షెల్డన్ జాక్సన్(0)లను పెవిలియన్ చేర్చాడు.

వికెట్లు తీసిన విశ్వాసమో ఏమో కానీ వానిందు తాను వేసిన 11వ ఓవర్‌లో ఆండ్రీ రస్సెల్‌కు స్లిప్ ఫీల్డర్ పెట్టి బౌలింగ్ చేశాడు. అతని గూగ్లీ బంతులను నిశితంగా పరిశీలించిన రస్సెల్.. ఐదో బంతిని భారీ సిక్సర్ బాదాడు. బంతిని గుంజి కొడితే 96 మీటర్ల దూరం వెళ్లింది. దాంతో నెటిజన్లు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఆండ్రీ రస్సెల్ ముందు పిల్ల చేష్టలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఓవరాక్షన్ చేస్తే రిజల్ట్ ఇలానే ఉంటుందని ట్రోల్ చేస్తున్నారు.

ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో మరో రెండు సిక్స్‌లు బాదిన రస్సెల్.. హర్షల్ పటేల్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. చిన్నపాటి తుఫానులా వచ్చి చెలరేగిపోయాడు. ఆ వెంటనే టీమ్ సౌథీ కూడా హసరంగా బౌలింగ్‌లో ఔటవ్వగా.. చివర్లో ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తీ 27 పరుగులు జోడించడంతో కేకేఆర్ 128 పరుగులకు ఆలౌటైంది. ఆర్‌సీబీ బౌలర్లలో వానిందు హసరంగా(4/20), హర్షల్ పటేల్(2/11) చెలరేగగా.. ఆకాశ్ దీప్ మూడు, సిరాజ్ ఓ వికెట్ తీశాడు.

Story first published: Wednesday, March 30, 2022, 21:43 [IST]
Other articles published on Mar 30, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+