Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: కరుణించిన వరణుడు.. కీలక మార్పుతో ఆర్‌సీబీ!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం వచ్చే సూచనలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. వర్షం వచ్చే సూచనలున్నాయి. మా చేజింగ్ బలం మరోసారి తెలుసుకోవాలనుకుంటున్నాం. వరుస విజయాలతో మూమెంటమ్‌ను కొనసాగించాలనుకుంటున్నాం. మంచి క్రికెట్ ఆడటంపైనే ఫోకస్ పెట్టాం. క్వాలిఫయర్‌కు ముందు ఇది గెలవడం మాకు కీలకం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని హార్దిక్ పాండ్యా తెలిపాడు.

RCB Batting First, Himanshu Sharma is making his debut for Bangalore

టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. 'పిచ్ కండిషన్స్ నేపథ్యంలో చేజింగ్ చేయాలనుకున్నాం. అయితే ఇక్కడ ముందుగా బ్యాటింగ్ చేసినవాళ్లకి మంచి రికార్డు ఉంది. ఈ మ్యాచ్ కోసం జట్టులోని ప్రతీ ఒక్కరు ఉత్సాహంగా ఉన్నారు. హిమాన్షు శర్మ స్థానంలో కర్ణ్ శర్మ జట్టులోకి వచ్చాడు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ గెలవడం ఆర్‌సీబీకి చాలా ముఖ్యం. ఓడితే మాత్రం ఇంటి దారి పట్టనుంది.

తుది జట్లు

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మైఖేల్ బ్రేస్‌వెల్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, అనూజ్ రావత్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, వ్యాన్ పార్నెల్, మహమ్మద్ సిరాజ్, విజయ్ కుమార్ వైశాఖ్

గుజరాత్ టైటాన్స్: శుభ్‌మన్ గిల్, వృద్దిమాన్ సాహా, హార్దిక్ పాండ్యా, డసన్ షనక, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, యష్ దయాల్

Story first published: Sunday, May 21, 2023, 20:10 [IST]
Other articles published on May 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+