Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: ప్చ్.. ఆర్‌సీబీ ఓటమి!

ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరుకు బ్రేక్‌పడింది. బుధవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన గుజరాత్ టైటాన్స్.. 8 వికెట్ల తేడాతో ఆర్‌సీబీని చిత్తు చేసింది. బౌలింగ్‌లో సిరాజ్(3/19).. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్.. ఆర్‌సీబీని చెడుగుడు ఆడేసారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్(40 బంతుల్లో ఫోర్, 5 సిక్స్‌లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. జితేష్ శర్మ(21 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 33), టీమ్ డేవిడ్(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32) దూకుడుగా ఆడారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ మూడు వికెట్లు తీయగా.. సాయి కిషోర్(2/22) రెండు వికెట్లు పడగొట్టాడు. అర్షద్ ఖాన్, ఇషాంత్ శర్మ తలో వికెట్ తీసారు.

అనంతరం గుజరాత్ టైటాన్స్ 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 170 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. జోస్ బట్లర్(39 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సాయి సుదర్శన్(36 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 49)రాణించాడు. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హజెల్ వుడ్ తలో వికెట్ తీసారు.

RCB vs GT IPL 2025 What was the Turning Point as Gujarat outplay Bengaluru

మ్యాచ్ టర్నింగ్ పాయింట్..
పవర్ ప్లేలోనే ఆర్‌సీబీ నాలుగు వికెట్లు కోల్పోవడం ఆ జట్టు విజయవకాశాలు దెబ్బతీసింది. సూపర్ ఫామ్‌లో ఉన్న ఫిల్ సాల్ట్‌తో పాటు విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ పేలవ ప్రదర్శన ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఈ టాప్-4 బ్యాటర్లలో ఒక్కరు క్రీజులో నిలబడినా ఫలితం మరోలా ఉండేది. సంచలన బౌలింగ్ ప్రదర్శనతో ఈ మ్యాచ్‌లో సిరాజ్ మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌గా నిలిచిపోయాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ లక్ష్యాన్ని చిన్నది చేసిన జోస్ బట్లర్ అన్‌సంగ్ హీరోగా నిలిచాడు.

జోస్ బట్లర్ విధ్వంసం..
ఈ స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఆడుతూ పాడుతూ చేధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(14) విఫలమైనా.. జోస్ బట్లర్‌తో కలిసి సాయి సుదర్శన్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడటంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టానికి 42 పరుగులే చేసింది. అనంతరం కాస్త దూకుడు పెంచిన ఈ జోడీ ఆర్‌సీబీ బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడింది.

హాఫ్ సెంచరీ ముంగిట సాయి సుదర్శన్‌ను హజెల్ వుడ్.. కీపర్ క్యాచ్‌గా ఔట్ చేయగా.. షెర్ఫెన్ రుథర్‌ఫోర్డ్ సాయంతో జోస్ బట్లర్ చెలరేగాడు. భారీ సిక్సర్లు బాదిన అతను 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో రూథర్‌ఫోర్డ్ సైతం బ్యాట్‌కు పనిచెప్పడంతో ఆర్‌సీబీ బౌలర్లు ఏం చేయలేకపోయాడు. హజెల్ వుడ్ వేసిన 18వ ఓవర్‌లో జోస్ బట్లర్ రెండు భారీ సిక్సర్లు బాది విజయాన్ని ఖాయం చేయగా.. రూథర్‌ఫోర్డ్ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు.

మలుపు తిప్పిన సిరాజ్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. పిచ్ నుంచి లభించిన సహకారాన్ని గుజరాత్ టైటాన్స్ బౌలర్లు అందిపుచ్చుకున్నారు. సిరాజ్ వేసిన తొలి ఓవర్‌లో‌నే ఫిల్ సాల్ట్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను జోస్ బట్లర్ నేలపాలు చేశాడు. కానీ ఆ మరుసటి ఓవర్‌లోనే విరాట్ కోహ్లీని(7) అర్షద్ ఖాన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్ తన వరుస ఓవర్లలో దేవదత్ పడిక్కల్(4)తో పాటు డేంజరస్ ఫిల్ సాల్ట్(14)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రెండు లైఫ్‌లు వచ్చినా ఫిల్ సాల్ట్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. దాంతో 35 పరుగులకే ఆర్‌సీబీ మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

ఆదుకున్న లివింగ్, జితేష్..
పవర్ ప్లే అనంతరం రజత్ పటీదార్‌ను ఇషాంత్ శర్మ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో జితేశ్ శర్మ, లియామ్ లివింగ్ స్టోన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. జితేశ్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. 52 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని సాయి కిషోర్ విడదీసాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో జితేశ్ శర్మ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా(5) తీవ్రంగా నిరాశపర్చాడు. సాయికిషోర్‌కు రిటర్న్ క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. టీమ్ డేవిడ్‌తో కలిసి లివింగ్ స్టోన్ చెలరేగాడు.

ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్‌లో విరుచుకుపడ్డాడు. అతని బౌలింగ్‌లో లివింగ్ స్టోన్ 5 సిక్సర్లు బాదడం విశేషం. ఈ క్రమంలో అతను 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో టీమ్ డేవిడ్ ఉండటంతో.. ఆర్‌సీబీ 190 పరుగులు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ 19వ ఓవర్ వేసిన సిరాజ్.. లివింగ్ స్టోన్‌ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఆ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే వచ్చాయి. ప్రసిధ్ కృష్ణ వేసిన ఆఖరి ఓవర్‌లో టీమ్ డేవిడ్.. వరుసగా 4, 6, 4 బాది ఆఖరి బంతికి ఔటయ్యాడు. ఈ ఓవర్‌లో 16 పరుగులే రావడంతో ఆర్‌సీబీ 169 పరుగులే చేయగలిగింది.

Story first published: Wednesday, April 2, 2025, 23:27 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+