For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs GT: వారి వల్లే కెప్టెన్‌గా సక్సెస్ అవుతున్నాను: రజత్ పటీదార్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. మంచి పిచ్‌లా కనిపిస్తోంది. ఇక్కడి పరిస్థితుల్లో పెద్దగా మార్పు కనిపించలేదు. మా తప్పిదాలను వీలైనంత వరకు తగ్గించుకోవాలి. మా బలహీనతలను అధిగమించే ప్రయత్నం చేస్తాం. వ్యక్తిగత కారణాలతో కగిసో రబడా ఈ మ్యాచ్ ఆడటం లేదు. అతని స్థానంలో అర్షద్ ఖాన్ తుది జట్టులోకి వచ్చాడు.'అని కేఎల్ రాహుల్ తెలిపాడు.

RCB vs GT IPL 2025 Rajat Patidar Says boys are chipping in gives a lot of confidence as a captain

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని రజత్ పటీదార్ తెలిపాడు. సహచర ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో కెప్టెన్‌గా తన పని సులువవుతుందని చెప్పాడు. 'మేం కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లం. ఎందుకంటే ఇది కొత్త వికెట్. చాలా కఠినంగా ఉంటుంది. పిచ్‌లో ఏ మాత్రం మార్పు ఉండదు. మా ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో కెప్టెన్‌గా నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. ఆర్‌సీబీ ప్రేక్షకులను మేం ప్రేమిస్తున్నాం. వారు మాపై చూపించే ప్రేమ.. ఇచ్చే మద్దతు అద్భుతం. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం.'అని రజత్ పటీదార్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

ఆర్‌సీబీ: ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్, యశ్ దయాల్

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

Story first published: Wednesday, April 2, 2025, 19:18 [IST]
Other articles published on Apr 2, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+