Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs GT: బెంగళూరులో భారీ వర్షం.. మ్యాచ్ రద్దయితే కోహ్లీ సేన పరిస్థితి ఏంటి?

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో కీలక పోరుకు సిద్దమైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)ని వరణుడు బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం బెంగళూరులో భారీ వర్షం కురుస్తోంది. ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగానే గుజరాత్ టైటాన్స్‌తో ఆర్‌సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.

13 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ.. ప్లే ఆఫ్స్ చేరాంటే గుజరాత్‌ టైటాన్స్‌పై తప్పకుండా విజయం సాధించాలి. లేకుంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. గుజరాత్ టైటాన్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. లక్నో సూపర్ జెయింట్స్ భవితవ్యం ఈ రాత్రికి తేలనుంది.

Virat Kohli

కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌లో లక్నో విజయం సాధిస్తే మరెవరితో సంబంధం లేకుండా ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఓడితే మాత్రం ముంబై, ఆర్‌సీబీ తదుపరి మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

ఇక గుజరాత్ టైటాన్స్‌పై మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఓడితే మాత్రం ముంబై ఇండియన్స్ ఫలితంపై ఆ జట్టు అవకాశాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఆర్‌సీబీ మ్యాచ్‌కు ముందే ముంబై సొంతమైదానంలో సన్‌రైజర్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఓడితే ఆర్‌సీబీకి మార్గం సుగుమం అవుతోంది.

ఈ సమీకరణాలు ఇలా ఉంటే ఇప్పుడు వర్షం ఆర్‌సీబీని వణికిస్తోంది. వాతావరణశాఖ రిపోర్ట్ ప్రకారం ఆదివారం కూడా బెంగళూరులో వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షంతో మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఇదే జరిగితే సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ముంబై ఇండియన్స్ ఎలాగైనా ఓడాల్సిందే. విజయం సాధిస్తే మాత్రం ఆర్‌సీబీ ఇంటిదారిపడుతోంది.

ఎందుకంటే 15 పాయింట్స్‌తో ఉన్న లక్నోసూపర్ జెయింట్స్ మెరుగైన రన్‌రేట్‌తో ఉంది. ఈ క్రమంలోనే రేపు వర్షం రావద్దని ఆర్‌సీబీ అభిమానులు ఆ దేవుడిని కోరుకుంటున్నారు.

Story first published: Saturday, May 20, 2023, 19:17 [IST]
Other articles published on May 20, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+