Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: ఢిల్లీదే బ్యాటింగ్.. మార్పుల్లేకుండా బరిలోకి ఇరు జట్లు!

RCB vs DC: Unchanged Bangalore opt to bowl against Delhi

దుబాయ్: ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మైదాన పరిస్థితులు, పిచ్ కొంచెం డ్రైగా ఉండటంతో బౌలింగ్ తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు.

ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. అయితే పిచ్ పొడిగా ఉన్న మాట వాస్తవమేనని, కానీ తాను టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకునేవాడినని రిషభ్ పంత్ తెలిపాడు. తమ జట్టు కూడా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుందని చెప్పాడు.

ఇప్పటికే ఇరు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకున్నాయి. 10 విజయాలతో ఢిల్లీ టాప్‌లో కొనసాగుతుండగా.. 8 విజయాలతో ఆర్‌సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడినా ఇరు జట్ల స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అయితే ప్లే ఆఫ్స్‌కు ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలనే పట్టుదలతో ఇరు జట్లు ఉన్నాయి. విజయం లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

తుది జట్లు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), దేవదత్ పడిక్కల్, కేఎస్ భరత్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, డాన్ క్రిస్టియన్, షాబాజ్ అహ్మద్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్

ఢిల్లీ క్యాపిటల్స్: శిఖర్ ధావన్, పృథ్వీ షా, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కెప్టెన్), రిపల్ పటేల్, షిమ్రన్ హెట్‌మైర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడా, ఆవేశ్ ఖాన్, అన్రిచ్ నోర్జ్

Story first published: Friday, October 8, 2021, 19:44 [IST]
Other articles published on Oct 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+