Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: మహమ్మద్ సిరాజ్ చెత్త రివ్యూ.. సహనం కోల్పోయిన విరాట్ కోహ్లీ!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ అత్యంత చెత్త రివ్యూ తీసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే దారుణమైన రివ్యూ తీసుకున్న బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఈ విచిత్రకర ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్‌లో రెండో ఓవర్ తొలి బంతిని సిరాజ్ యార్కర్‌గా సంధించగా.. అభిషఏక్ పోరెల్ థర్డ్ మ్యాన్ దిశగా ఆడాడు. అయితే బంతి ప్యాడ్‌కు తాకిందని పొరబడిన సిరాజ్.. గట్టిగా అప్పీల్ చేశాడు. అయితే ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో సిరాజ్ రివ్యూ కోసం పట్టుబట్టాడు. ఇతర బ్యాటర్లు వద్దని చెప్పినా.. వినకుండా రివ్యూ తీసుకోమన్నాడు.

RCB vs DC Mohammed Siraj takes worst review in IPL 2024 Match vs Delhi

కానీ రీప్లేలో బంతి బ్యాట్‌ను తాకినట్లు స్పష్టంగా కనబడటంతో థర్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. ఈ చెత్త రివ్యూను చూసి కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ తీవ్ర అసహనానికి లోనయ్యారు. సిరాజ్‌ వైపు ఆగ్రహంగా చూశారు.

ఈ చెత్త రివ్యూ నేపథ్యంలో సిరాజ్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. టీ20 ప్రపంచకప్‌లో సిరాజ్ రివ్యూ తీసుకోమన్నప్పుడు రోహిత్ శర్మ పునరాలోచన చేయాలని, గుడ్డిగా తీసుకోవద్దని హితవు పలుకుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 187 పరుగులు చేసింది. రజత్ పటీదార్(32 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 52) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 32 నాటౌట్), విల్ జాక్స్(29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41) రాణించారు.

విరాట్ కోహ్లీ(13 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 27) ధాటిగా ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో రసిక్ సలామ్(2/23), ఖలీల్ అహ్మద్(2/31) రెండేసి వికెట్లు తీయగా.. ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు.

Story first published: Sunday, May 12, 2024, 22:20 [IST]
Other articles published on May 12, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+