Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: ఆర్‌సీబీ కొంపముంచిన దినేశ్ కార్తీక్.. ఢిల్లీ ముందు ఈజీ టార్గెట్!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బ్యాటర్లు విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ(34 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 50) మినహా అంతా స్వల్ప స్కోర్లకే పరిమితమవ్వడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 174 పరుగులు చేసింది.

ఫాఫ్ డుప్లెసిస్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), విరాట్ కోహ్లీ సూపర్ బ్యాటింగ్‌తో 89/1తో భారీ స్కోర్ దిశగా సాగిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. కీలక సమయంలో దినేశ్ కార్తీక్(0) గోల్డెన్ డకౌటవ్వడం టీమ్ భారీస్కోర్ అవకాశాలను దెబ్బతీసింది.

 Kuldeep Yadav, Marsh help Delhi Restrict RCB to 174/6

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం అమన్ ఖాన్ సూపర్ క్యాచ్‌కు ఫాఫ్ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్‌తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడపించాడు. దాంతో పవర్ ప్లేలో ఆర్‌సీబీ వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది.

పవర్ ప్లే అనంతరం ధాటిగా ఆడిన ఈ జోడీ స్కోర్ బోర్డును పరుగెత్తించింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బౌలింగ్‌లో ఓ బౌండరీతో పాటు సిక్స్ బాదిన కోహ్లీ 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్‌సీబీ.. వికెట్ నష్టానికి 89 పరుగులు చేసి పటిష్టంగా కనిపించింది. కానీ 11వ ఓవర్ వేసిన లలిత్ యాదవ్.. లో ఫుల్ టాస్‌తో కోహ్లీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చి దెబ్బ కొట్టాడు.

క్రీజులోకి వచ్చిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ మూడు భారీ సిక్స్‌లు బాదగా.. లోమ్రోర్ రెండు సిక్స్‌లు కొట్టాడు. కానీ మిచెల్ మార్ష్.. క్రీజులో సెట్ అయిన మహిపాల్ లోమ్రోర్(26)ను కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చగా.. హర్షల్ పటేల్‌ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.

కుల్దీప్ యాదవ్ వరుసగా గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్‌(0)లను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఈ రెండు వికెట్లతో పటిష్టంగా కనిపించిన ఆర్‌సీబీ ఇన్నింగ్స్ కాస్త బలహీనంగా మారింది. చివర్లో షెహ్‌బాజ్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అనూజ్ రావత్ బిగ్ షాట్స్ ఆడకపోయినా.. మరో వికెట్ పడకుండా ఆడపాదడపా బౌండరీలతో జట్టు స్కోర్‌ను 170 పరుగుల మార్క్‌ను ధాటించారు.

Story first published: Saturday, April 15, 2023, 17:22 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+