Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: తెలుగోడి దెబ్బ.. ఢిల్లీ అబ్బ! ఆఖరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన కేఎస్ భరత్!

KS Bharat stars as Bangalore beat Delhi by 7 wickets
KS Bharat గెలుపు Kohli Celebration ప్రతీ తెలుగోడికీ Goosebumps, Best Moments VIDEO | Oneindia Telugu

దుబాయ్: తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 78 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో చెలరేగడంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్నందుకుంది. పటిష్ట ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లీసేన 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆఖరి బంతికి ఆర్‌సీబీ విజయానికి 5 పరుగులు కావాల్సి ఉండగా.. సిక్స్ కొట్టి కేఎస్ భరత్.. ఢిల్లీకి దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ గెలుపుతో ఆర్‌సీబీ ఐపీఎల్‌లో 100 విజయాలను పూర్తి చేసుకుంది. ఈ ఘనతను అందుకున్న నాలుగో జట్టుగా నిలిచింది.

ఆల్‌రౌండ్ షో..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీ షా(31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48), శిఖర్ ధావన్(35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్(2/25) రెండు వికెట్లు తీయగా.. యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, డాన్ క్రిస్టియన్ తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 166 పరుగులు చేసింది. కేఎస్ భరత్‌కు అండగా మ్యాడ్ మ్యాక్సీ(33 బంతుల్లో 8 ఫోర్లతో 51 నాటౌట్) చెలరేగాడు. ఢిల్లీ బౌలర్లలో అన్రిచ్ నోర్జ్ రెండు, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశాడు.

ఆదిలోనే గట్టి షాక్..

165 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీకి ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. అన్రిచ్ నోర్జ్ వేసిన ఫస్ట్ ఓవర్‌లోనే ఓపెనర్ దేవదత్ పడిక్కల్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ బిగించిన ఉచ్చులో చిక్కుకున్నాడు. నోర్జ్ వేసిన బౌన్సర్‌ను అప్పర్ కట్ ఆడే ప్రయత్నం చేసిన పడిక్కల్.. థర్డ్ మ్యాన్ ఫీల్డర్‌కు చిక్కాడు. ఇక అన్రిచ్ వేసిన మరుసటి ఓవర్‌లోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ(4) సైతం విఫలమయ్యాడు. భారీ షాట్‌కు ప్రయత్నించిన అతను రబడాకు చిక్కాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన శ్రీకర్ భరత్, ఏబీ డివిలియర్స్(26) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వికెట్ కాపాడుకునే ప్రయత్నంలో నిదానంగా ఆడటంతో ఆర్‌సీబీ పవర్ ప్లేలో రెండు వికెట్ల నష్టానికి 29 రన్స్ మాత్రమే చేసింది.

కేఎస్ భరత్ హాఫ్ సెంచరీ..

అనంతరం ఏబీడీ బౌండరీలు బాదడంతో పరుగులు వచ్చాయి. క్రీజులో కుదురుకున్న ఈ జోడీనీ అక్షర్ పటేల్ విడదీసాడు. జోరు మీదున్న ఏబీడీని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో మూడో వికెట్‌కు నమోదైన 49 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్‌తో శ్రీకర్ భరత్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. చూడ ముచ్చటైన షాట్లతో ఆకట్టుకున్నాడు. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో పాటు బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. తనదైన బ్యాటింగ్‌తో మ్యాక్సీ కుదురుకునేందుకు టైమ్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే 37 బంతుల్లో మూడు ఫోర్లు, 2 సిక్సర్లతో భరత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

లాస్ట్ బాల్ సిక్స్..

ఇక అక్షర్ బౌలింగ్‌లో మ్యాక్సీ ఇచ్చిన రెండు సునాయస క్యాచ్‌లను ఢిల్లీ ఫీల్డర్లు నేలపాలు చేశారు. దాంతో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న మ్యాక్సీ.. జట్టు విజయానికి చేరువగా తీసుకెళ్లాడు. చివరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 15 రన్స్ అవసరం కాగా.. ఫస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టిన మ్యాక్సీ.. రెండో బంతికి క్విక్ డబుల్‌ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గత ఐదు ఇన్నింగ్స్‌ల్లో మ్యాక్సీ నాలుగు హాఫ్ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత సింగిల్ రాగా.. మరుసటి బంతిని శ్రీకర్ భరత్ డాట్ చేశాడు. ఐదో బంతికి డబుల్ తీయగా.. ఆఖరి బంతికి సిక్స్ కొట్టాల్సి వచ్చింది. అయితే అవేశ్ ఖాన్ వైడ్ వేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఆర్‌సీబీ ఆఖరి బంతికి 5 పరుగులు చేయాల్సి వచ్చింది. దాంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీస్తుందా? అనిపించింది. కానీ శ్రీకర్ భరత్ సూపర్ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించి అందర్ని ఆనందంలో ముంచెత్తాడు.

Story first published: Friday, October 8, 2021, 23:52 [IST]
Other articles published on Oct 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+