ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు మైదానం ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుందనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కలిక కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు.
పదే పదే స్లో ఓవర్ రేట్‌కు కారణమవ్వడంతో రెగ్యులర్ కెప్టెన్ రిషభ్ పంత్‌పై ఐపీఎల్ నిర్వాహకులు రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం విధించిన విషయం తెలిసిందే. దాంతో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ అక్షర్ పటేల్‌కు తాత్కలిక సారథ్య బాధ్యతలు అప్పగించింది.

ఈ మ్యాచ్ నిషేధంపై రిషభ్ పంత్ చాలా కోపంగా ఉన్నాడని అక్షర్ పటేల్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. బెంగళూరు వికెట్ ఛేజింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. మాకు శుభారంభం దక్కితే గేమ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయిస్తాం. రిషభ్ పంత్ చాలా కోపంగా ఉన్నాడు. సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా అప్పీల్ కూడా చేశాడు.
ప్రస్తుతం అతను మైదానంలో ఉన్నాడు. మమ్మల్ని ప్రోత్సహిస్తున్నాడు. అతని స్థానంలో కుశాగ్ర జట్టులోకి వచ్చాడు. రసిక్ ధార్ సైతం ఆడుతున్నాడు.'అని అక్షర్ పటేల్ తెలిపాడు.
పిచ్‌పై గ్రాస్ తక్కువగా ఉందని, పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. ప్రతీ మ్యాచ్ గెలవడం తమ లక్ష్యమని, తమ జట్టు అద్భుతమైన క్రికెట్ ఆడుతుందని చెప్పాడు. అదే జోరును కొనసాగిస్తామని, డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కూడా భిన్నంగా ఉందని తెలిపాడు.
ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యిందని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌ను కొనసాగిస్తున్నామని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
తుది జట్లు:
ఆర్‌సీబీ: ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్(కీపర్), కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, లాకీ ఫెర్గూసన్, యశ్ దయాల్.
ఢిల్లీ క్యాపిటల్స్: జేక్ ఫ్రెసర్-మెక్‌గర్క్, అభిషేక్ పోరెల్, షై హోప్, కుమార్ కుశాగ్ర, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రసిక్ ధార్ సలామ్, ముఖేష్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.