బెంగళూరు: టీమ్ కాంబినేషన్‌లో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు డేవిడ్ విల్లేను పక్కనపెట్టామని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. వరల్డ్ నెంబర్ వన్ స్పిన్నర్ వానిందు హసరంగా కోసం డేవిడ్ విల్లేను బెంచ్‌కు పరిమితం చేయాల్సి వచ్చిందని తెలిపాడు.
ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సీబీ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో టర్న్ ఉంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్ అని చెప్పిన ఫాఫ్.. తాను విరాట్ వీలైనంత మేరకు ఇక్కడి పరిస్థితులను అందిపుచ్చుకొని మంచి శుభారంభం అందించడం ముఖ్యమని చెప్పాడు.

డెత్ ఓవర్లలో లక్ష్యాన్ని కాపాడుకోవడం కష్టమని, హోమ్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ పరంగా తమకు తిరుగులేదన్నాడు. ఈ మైదానంలో విజయం సాధించాలంటే అత్యుత్తమ బౌలర్లతో పాటు బ్యాటర్లతో బరిలోకి దిగాలని చెప్పాడు. జట్టులో ఒక మార్పు చేశామని చెప్పిన ఫాఫ్ డుప్లెసిస్.. వానిందు హసరంగా కోసం డేవిడ్ విల్లేను పక్కనపెట్టాల్సి వచ్చిందన్నాడు.
రీస్ టోప్లీ గాయంతో జట్టుకు దూరమవడంతో తుది జట్టులో అవకాశం అందుకున్న డేవిడ్ విల్లే గత రెండు మ్యాచ్‌ల్లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ ఓవర్ సీస్ ప్లేయర్లు నలుగురినే ఆడించాలనే రూల్ ఉండటంతో విల్లేను పక్కకు పెట్టాల్సి వచ్చింది.
టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మైదాన కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. మైదానం కూడా చాలా అద్భుతంగా ఉందని, ఈ క్రెడిట్ గ్రౌండ్ స్టాఫ్‌దేనని అభినందించాడు. వరుస పరాజయాలకు తాము బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందన్న వార్నర్.. మూమెంటమ్ కోసం ఒక్క విజయం కావాలన్నాడు.
పవర్ ప్లేలో వికెట్లు కోల్పోకపోతే విజయాన్నందుకోవచ్చని చెప్పాడు. మిచెల్ మార్ష్ అందుబాటులోకి రావడంతో రోవ్‌మెన్ పోవెల్ బెంచ్‌కే పరిమితమయ్యాడని తెలిపాడు.