Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs DC: అమన్ ఖాన్ అదరిపోయే క్యాచ్.. బిత్తరపోయిన ఫాఫ్ డుప్లెసిస్ (వీడియో)

బెంగళూరు: ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్ అమన్ హకీమ్ ఖాన్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో అమన్ ఖాన్ గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో అదరిపోయే రీతిలో క్యాచ్ అందుకున్నాడు. అమన్ ఖాన్ స్టన్నింగ్ క్యాచ్‌తో వరుస బౌండరీలతో జోరు కనబర్చిన ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22) పెవిలియన్ బాట పట్టాడు.

అమన్ ఖాన్ సూపర్ ఫీల్డింగ్‌కు ఫాఫ్ డుప్లెసిస్ బిత్తరపోయాడు. మిచెల్ మార్ష్ వేసిన ఐదో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకోగా.. ఐపీఎల్ 2023 సీజన్‌లోని గొప్ప క్యాచ్‌‌ల జాబితాలో ఇది చేరింది. ప్రస్తుతం ఈ క్యాచ్ సంబంధించిన వీడియో, ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

dismiss Faf du Plessis goes viral

మిచెల్ మార్ష్ వేసిన నాలుగో బంతిని ఫాఫ్ డుప్లెసిస్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ కొట్టగా.. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అమన్ ఖాన్ గాల్లోకి ఎగిరి బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చిక్కకపోగా.. రెండో ప్రయత్నంలో అందుకున్నాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీకి ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 42 పరుగులు జోడించిన అనంతరం అమన్ ఖాన్ సూపర్ క్యాచ్‌కు ఫాఫ్ వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన మహిపాల్ లోమ్రోర్‌తో కలిసి విరాట్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడపిస్తున్నాడు.

ముస్తాఫిజుర్ బౌలింగ్‌లో ఓ బౌండరీతో పాటు సిక్స్ బాది 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆర్‌సీబీ.. వికెట్ నష్టానికి 89 పరుగులు చేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ 2500 ఐపీఎల్ రన్స్ పూర్తి చేసుకున్నాడు.‌

Story first published: Saturday, April 15, 2023, 16:26 [IST]
Other articles published on Apr 15, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+