Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

RCB vs CSK: కోహ్లీ మామ.. వామికను డేట్ తీసుకెళ్లొచ్చా? బుడ్డోడి ఎకసెక్కాలు!

బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ అభిమానులకు కావాల్సిన అసలు సిసలు మజాను అందించింది. సోమవారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిసింది. ఇరు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో బౌలర్లకు ఏడుపు ఒక్కటే తక్కువైంది. చివరకు ఈ హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 పరుగులతో విజయం దక్కించుకోగా.. ఆర్‌సీబీ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.

అయితే ఈ మ్యాచ్‌కు హాజరైన ఓ బుడ్డోడు పట్టుకున్న ప్లకార్డు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 3-4 ఏళ్ల వయసు ఉంటే ఓ బాలుడు విరాట్ కోహ్లీని మామ అంటూ ఓ రిక్వెస్ట్ ప్లకార్డును ప్రదర్శించాడు. అందులో వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా? అని కోహ్లీని అడిగాడు. ఆర్‌సీబీ జెర్సీ వేసుకున్న ఆ చిన్నారి 'హాయ్ విరాట్ మామ.. నేను వామికాను డేట్‌కు తీసుకెళ్లొచ్చా'అని ప్లకార్డును ప్రదర్శించాడు. ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

young fan virat kohli vamika

'కోహ్లీ కూతురికే సైట్ వేస్తున్నావంటే.. నువ్వు మగాడివిరా బుడ్డోడా'అని కామెంట్ చేస్తున్నారు. పెద్దగా అయిన తర్వాత వామికాను డేట్ తీసుకెళ్లి... ఇలానే ఇద్దరు కలిసి మ్యాచ్‌కు రావాలని మరికొందరు కోరుతున్నారు. ఇంకొందరు మాత్రం ఈ ముచ్చట అనుష్క అత్తకు తెలిస్తే నిన్ను చింతపండు చేస్తుందిరా బుడ్డోడా.. అని సెటైర్లు పేల్చుతున్నారు. పిట్టె కొంచె కూత ఘనమంటే ఇదేనేమో అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు.

అందరి దృష్టిని ఆకర్షించేందుకే ఆ బాలుడి తల్లిదండ్రులు ఇలా చేసి ఉంటారని, ఈ విషయాన్ని సరదాగా తీసుకొండని మరికొందరు సూచిస్తున్నారు. 2021 జనవరి 11న విరాట్ కోహ్లీ-అనుష్క శర్మలకు వామికా జన్మించగా.. ఇప్పటి వరకు ఆమె ఫొటోను అధికారికంగా విడుదల చేయలేదు. పైగా తన కూతురి ప్రైవసీకి భగ్నం చేయవద్దని, ఆమె ఫొటోలను తీయవద్దని అన్ని మీడియా సంస్థలకు విజ్ఞప్తి చేస్తూ కోహ్లీ-అనుష్క లేఖలు కూడా రాసారు.

అత్యుత్సాహం ప్రదర్శించిన మీడియా హౌజ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వామికాతో బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడల్లా ఆమె ముఖం కనిపించకుండా కవర్ చేస్తున్నారు. చివరకు తమకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నప్పుడు కూడా ఆమె ఫేస్ కవర్ చేస్తున్నారు. దాంతో వామికా రూపం తెలియకున్నా ఆ చిన్నారి పేరు పాపులర్‌గా మారింది.

Story first published: Tuesday, April 18, 2023, 16:29 [IST]
Other articles published on Apr 18, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+