
రెండు క్యాచ్‌లు..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. ఆర్‌సీబీతో జరిగే ఈ మ్యాచ్‌లో మహీ మరో రెండు క్యాచ్‌లు అందుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం ధోనీ 114 క్యాచ్‌లతో రెండో స్థానంలో ఉండగా.. కోల్‌కతా నైట్‌రైడర్స్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ 115 క్యాచ్‌లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటికే 114 క్యాచ్‌లు, 39 స్టంపౌట్లలో పాలుపంచుకున్న మహీ.. లీగ్‌లో అత్యధిక ఔట్లలో భాగమైన ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీ10 వేలు..
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీని మరో అరుదైన ఘనత ఊరిస్తుంది. చెన్నైతో నేడు జరిగే మ్యాచ్‌లో ఈ పరుగుల యంత్ర మరో 66 రన్స్ చేస్తే టీ20 క్రికెట్‌లో 10 వేల పరుగుల మైలు రాయిని అందుకోనున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఖాతాలో 9,934 టీ20 రన్స్ ఉన్నాయి. ఇందులో టీమిండియా తరఫున 3,159 పరుగులు చేయగా.. ఐపీఎల్‌లో 6,081 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోల్‌కతాతో జరిగిన గత మ్యాచ్‌లో దారుణంగా వికెట్ ఇచ్చుకున్న విరాట్.. ఈ మ్యాచ్‌లో రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.

డివిలియర్స్ 250
ఆర్‌సీబీ విధ్వంసకర బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ కూడా అరుదైన ఘనతకు చేరువగా ఉన్నాడు. ఐపీఎల్‌లో 250 సిక్సుల మైలురాయికి అందుకోవడానికి ఈ సౌతాఫ్రికా దిగ్గజం..మరో 5 సిక్స్‌ల దూరంలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సీజన్లో 8 మ్యాచ్‌ల్లో 10 సిక్సులు ఏబీడీ బాడాడు. అదే జోరును నేటి మ్యాచ్‌లో చూపిస్తే ఈ మైలురాయిని చేరుకుంటాడు. 357 సిక్సులతో ఈ జాబితాలో క్రిస్ గేల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సిరాజ్, రైనా కూడా..
ఆర్‌సీబీ స్టార్ పేసర్, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్ సిరాజ్ కూడా అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్‌లో 50 వికెట్లు సాధించిన మైలురాయిని చేరుకునేందుకు అతను 5 వికెట్ల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకు 43 ఐపీఎల్ మ్యాచ్‌లాడిన సిరాజ్.. 45 వికెట్లు సాధించాడు. నేటి మ్యాచ్‌లో సిరాజ్ చెలరేగితే ఈ ఘనతను అందుకోవచ్చు.
సీఎస్‌కే వెటరన్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం రైనా ఖాతాలో 5,495 పరుగులు ఉన్నాయి. మరో 5 పరుగులు సాధిస్తే 5,500 పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. కోహ్లీ (6,081), ధావన్ (5,619), రోహిత్ (5,513) ఇప్పటికే ఈ ఘనతను సాధించారు.


Click it and Unblock the Notifications












