For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs CSK: కోహ్లీసేన‌దే బ్యాటింగ్.. జట్టులోకి కొత్త ఆటగాడు

 MS Dhoni wins toss, CSK opt to bowl in Sharjah

షార్జా: ఐపీఎల్ 2021 సెకండాఫ్‌లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. చిన్న మైదానం, పిచ్‌పై ఉన్న పగుళ్ల నేపథ్యంలోనే ఫీల్డింగ్ ఎంచుకున్నానని సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. గతేడాది ఈ మైదానంలో ఆడిన మ్యాచ్‌లో తేమ కనిపించిందని చెప్పాడు. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు. 'రాయుడు గాయపడ్డా గత మ్యాచ్‌లో సమష్టిగా రాణించాం. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ప్రత్యేకమైన ప్రదర్శన కనబర్చాం. స్వల్ప లక్ష్యమే విధించినా అద్భుత బౌలింగ్‌తో కాపాడుకున్నాం. రుతురాజ్ అద్భుతమైన ఆటగాడు, విభిన్నమైన షాట్లు ఆడగల సామర్థ్యం అతనికి ఉంది. అతను తన ఆటతో జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నాడు'అని ధోనీ చెప్పుకొచ్చాడు.

పిచ్ చూడటానికి బాగానే ఉందని ఆర్‌సీబీ కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అయితే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు. దానికి అనుగుణంగా తమ బౌలర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుందన్నాడు. బ్యాటింగ్‌లో కొన్ని ఎక్కువ పరుగులు చేస్తే బాగుంటుందన్నాడు. గత మ్యాచ్ ఓటమి తర్వాత తామంతా సానుకూలంగా ఉన్నామని చెప్పాడు. ఆరంభంలోనే ఓటమి ఎదురువ్వడంతో తమ తప్పిదాలు తెలిసాయన్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. కైల్ జెమీసన్, సచిన్ బేబీ స్థానాల్లో నవ్‌దీప్ సైనీ, అరంగేట్ర ప్లేయర్ టిమ్ డేవిడ్ ఆడుతున్నారని చెప్పాడు.

ఇక షార్జాలో గాలి దుమారం కారణంగా టాస్‌కు 30 నిమిషాలు ఆలస్యమైంది. కెప్టెన్లుగా ధోనీ, కోహ్లీ ఇదే చివరి మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది. ఆర్‌సీబీ కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకుంటానని చెప్పగా.. ధోనీ క్రికెట్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. అయితే ప్లే ఆఫ్స్‌కు చేరితే అక్కడ ఈ రెండు జట్లు తలపడే అవకాశం కూడా ఉంది. ఇక సెకండాఫ్‌ను చెన్నై గెలుపుతో ప్రారంభిస్తే.. ఆర్‌సీబీ మాత్రం ఓటమితో మొదలుపెట్టింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడింది.

తుది జట్లు:

ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ (కేప్టెన్), దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్, వనిందు హసరంగ, టిమ్ డేవిడ్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యజువేంద్ర చాహల్‌

చెన్నై సూపర్ కింగ్స్: ఫాప్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కేప్టెన్-వికెట్ కీపర్), డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాగూర్, దీపక్ చాహర్, జోష్ హేజిల్‌వుడ్

Story first published: Friday, September 24, 2021, 19:58 [IST]
Other articles published on Sep 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+