ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ చూడటానికి బాగుంది. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలో బౌలింగ్ ఎంచుకున్నా. తొలి 2-3 ఓవర్లు పేసర్లకు మంచి మూవ్‌మెంట్ లభించనుంది. ఈ అడ్వాంటేజ్‌ను వాడుకుంటాం. పిచ్ కొంచెం తడిగా కూడా కనిపిస్తోంది. కానీ మేము మంచి ఇంటెంట్‌తో బరిలోకి దిగుతున్నాం.

ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే. మా ప్రణాళికల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని ముందుకు సాగుతాం. ఈ టోర్నీ మధ్యలో మేం కీలక మ్యాచ్‌లు గెలిచాం. తుది జట్టులో ఒకే ఒక్క మార్పు చేశాం. మోయిన్ అలీ స్థానంలో మిచెల్ సాంట్నర్ జట్టులోకి వచ్చాడు.'అని రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.
మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. కానీ చివరిసారిగా మేం ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు భారీ స్కోర్ చేశాం. కీలక మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం మంచిది కాదు. గత 5 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం మా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
గత మ్యాచ్ విజయం మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఈ చివరి లీగ్ మ్యాచ్ ఆడేందుకు మేమంతా సంతోషంగా సిద్దమయ్యాం. ప్లే ఆఫ్స్ అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంపై మాత్రమే ఫోకస్ పెట్టాం.'అని ఫాఫ్ డుప్లెసిస్ తెలిపాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని డుప్లెసిస్ చెప్పాడు. కానీ విల్ జాక్స్ స్వదేశం వెళ్లిపోవడంతో అతని స్థానంలో గ్లేన్ మ్యాక్స్‌వెల్ బరిలోకి దిగాడు.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో విజయం సాధించడంతో పాటు 18 ప్లస్ రన్స్ తేడాతో విజయం సాధించాలి. అప్పుడే మెరుగైన రన్‌రేట్‌తో సీఎస్‌కేను వెనక్కి నెట్టి ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరుతోంది. మరోవైపు సీఎస్‌కే ఈ మ్యాచ్‌లో గెలిచినా.. తక్కువ మార్జిన్‌తో ఓడినా టోర్నీలో ముందడుగు వేస్తోంది.
తుది జట్లు:
ఆర్‌సీబీ: ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, రజత్ పటీదార్, కామెరూన్ గ్రీన్, మహిపాల్ లోమ్రోర్, దినేశ్ కార్తీక్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్
సీఎస్‌కే: రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్, డారిల్ మిచెల్, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్, మహీష్ తీక్షణ