బెంగళూరు: ఐపీఎల్ 2023 సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ టర్న్ అయ్యే అవకాశం ఉండటంతో పాటు డ్యూ కీలక పాత్ర పోషిస్తుందని ఈ నిర్ణయం తీసుకున్నానని ఆర్‌సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు.
180-200 లక్ష్యాన్ని కూడా ఈ పిచ్‌పై సునాయసంగా చేధించవచ్చన్నాడు. మైదానం చిన్నగా ఉండటంతో పాటు బంతి బ్యాట్‌పైకి వస్తుందని, ఇది బ్యాటర్లకు హెల్ప్‌గా ఉంటుందని చెప్పాడు. తుది జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను జట్టుకు తగ్గ వ్యూహాలకు వాడుకుంటామని చెప్పాడు.

ఈ మైదానంలో టాస్ ప్రభావం ఏ మాత్రం ఉండదని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తెలిపాడు. ఈ పిచ్‌లో బ్యాటర్లను ఆపడం కష్టమని, డ్యూ కూడా ఉంటుందని చెప్పాడు. 180-200 పరుగులు చేస్తే కాపాడుకోవచ్చన్నాడు. భారీ లక్ష్యం సాధించే దిశగా ఆడుతామని తెలిపాడు.
జట్టులో తప్పని పరిస్థితుల్లో ఒక మార్పు చేశామని చెప్పిన ధోనీ.. మగలా స్థానంలో పతీరణ వచ్చాడని తెలిపాడు. గొప్ప విషయం ఏంటంటే తమ రిప్లేస్ ఆటగాళ్లంతా అద్భుతంగా రాణిస్తున్నారని చెప్పాడు. ఆటగాళ్లు వరుసగా గాయపడటం జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్: డేవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, మహేంద్ర సింగ్ ధోనీ(కీపర్), మహీశ పతీరణ, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ
ఆర్‌సీబీ: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), హర్షల్ పటేల్, వానిందు హసరంగా, వ్యాన్ పార్నెల్, విజయ్ కుమార్ వైశాఖ్, మహమ్మద్ సిరాజ్