For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఓయ్ కోహ్లీ కెప్టెన్సీ కాదు.. నువ్వు క్రికెట్‌ నుంచే తప్పుకోవాలి! ఆర్‌సీబీ ఘోర ఓటమిపై ఫ్యాన్స్ ఫైర్!

RCB trolled brutally after their batting collapse vs KKR in IPL 2021
IPL 2021 : Fans Troll RCB & Virat Kohli కోహ్లీని T20 WC నుంచి తప్పించాలి!! || Oneindia Telugu

హైదరాబాద్: ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో వరుస విజయాలతో దుమ్మురేపిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు‌(ఆర్‌సీబీ)కి అరబ్ గడ్డపై కలిసిరాలేదు. ఫేవరేట్‌గా బరిలోకి దిగిన మ్యాచ్‌లో తమకంటే తక్కువ స్థాయి ప్రత్యర్థి అయిన కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో చిత్తుగా ఓడింది. వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ అందుబాటులో ఉన్నా.. ఓపికగా ఆడలేక బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమైంది. ఫలితంగా ఐపీఎల్‌లో తన 200 మ్యాచ్‌ కోహ్లీకి చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. మరోవైపు ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన కేకేఆర్ 9 వికెట్ల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. అయితే ఈ దారుణ ఓటమిని ఆర్‌సీబీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. టీమ్ పెర్ఫామెన్స్‌పై సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.

కోహ్లీ.. క్రికెట్ వదిలేసి సినిమాలు చేసుకో..

ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ(5) వైఫల్యాన్ని సహించలేకపోతున్నారు. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌లోనే కోహ్లీ.. ప్రసిధ్ కృష్ణ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికి పోయాడు. దాంతో ఆర్‌సీబీ జట్టుకు కోహ్లీ భారంగా తాయరయ్యాడని ఒకరంటే.. అసలు కోహ్లీని ఓపెనర్‌గా పంపించడమే పిచ్చి నిర్ణయమని మరొకరు విమర్శించారు. రెగ్యూలర్‌గా వచ్చే నెంబర్ 3లోనే కోహ్లీని ఆడించాలని సూచిస్తున్నారు. ఇటీవల టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కోహ్లీ చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ సెటైర్లు పేల్చుతున్నారు. కెప్టెన్సీ నుంచి కాకుండా క్రికెట్‌నే వదిలేయాలని, కోహ్లీ కెరీర్ ముగిసిందని ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. క్రికెట్‌‌ను వదిలేసి అనుష్కశర్మతో కలిసి హాయిగా సినిమాలు చేసుకోవాలని సూచిస్తున్నారు.

కోహ్లీ ఓ ఆర్డినరీ‌ ప్లేయర్..

విరాట్ కోహ్లీ ఎక్స్‌ట్రార్డినర్ ప్లేయర్ కాదని, ఎక్స్‌ట్రా ఆర్డినర్ ప్లేయరంటూ సెటైర్లు పేల్చుతున్నారు. ఔటైన తర్వాత కోహ్లీ పరిస్థితి ఇదని ఫన్నీ మీమ్స్ ట్రేండ్ చేస్తున్నారు. కోహ్లీ ఇంకా టెస్ట్ మోడ్‌లోనే ఉన్నాడని, టీ20 ఫార్మాట్‌లో ఆడుతున్నామనే విషయాన్ని గ్రహించాలని సూచిస్తున్నారు. కోహ్లీ అభిమానులమని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని కూడా ఘాటుగా కామెంట్ చేస్తున్నారు. ఓడినా బాధలేదని, కానీ ఆర్‌సీబీ ఆటగాళ్ల ఆటతీరే తీవ్రంగా కలచి వేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఆడితే టైటిల్ గెలవడం కాదు కదా.. ప్లే ఆఫ్స్ కూడా చేరలేరంటున్నారు. ఇలా ఆడితే కోహ్లీని టీ20 ప్రపంచకప్ టీమ్ నుంచి తప్పించాలని బీసీసీఐకి సూచిస్తున్నారు.

ఏమైంది.. ఏబీడీ

కష్టాల్లో ఉన్నప్పుడు జట్టును ఆదుకునే ఏబీ డివిలియర్స్‌కు ఏమైందని ప్రశ్నిస్తున్నారు. ఇక రస్సెల్ బౌలింగ్‌లో ఏబీ డివిలియర్స్ గోల్డెన్ డక్ అవ్వడాన్ని ప్రస్తావిస్తూ తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏబీడి గోల్డెన్ డక్ అవ్వడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. ఇక భారత్ వేదికగా దుమ్మురేపిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ యూఏఈ వేదికగా మళ్లీ తన తడబాటు కొనసాగిస్తున్నాడని పేర్కొంటున్నాడు. గతేడాది పంజాబ్ కింగ్స్ తరఫున అరబ్ గడ్డపై తీవ్రంగా ఇబ్బంది పడ్డాడని, ఇప్పుడు కూడా అతన్ని అదే భయం వెంటాడుతున్నట్లుందని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌సీబీ, కేకేఆర్ మ్యాచ్‌కు సంబంధించిన మీమ్స్, ట్రోల్స్ నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. కోహ్లీ టాస్ గెలవడమే ఆర్‌సీబీకి శాపమైందంటున్నారు.

ఆడుతూ పాడుతూ..

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19 ఓవర్లలో 92 రన్స్‌కు కుప్పకూలింది. దేవదత్ పడిక్కల్(22) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తీ(3/13), ఆండ్రీ రస్సెల్(3/9) బెంగళూరు పతనాన్ని శాసించగా.. ఫెర్గూసన్ రెండు, ప్రసిధ్ కృష్ణ ఓ వికెట్ తీశారు. అనంతరం కోల్‌‌కతా 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 94 రన్స్ చేసి ఘన విజయాన్నందుకుంది. చిన్న టార్గెట్‌ను ఓపెనర్లు శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 48), అరంగేట్ర ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్(27 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 41 నాటౌట్) నింపాదిగా ఛేదించారు. ఆర్‌సీబీ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Tuesday, September 21, 2021, 12:09 [IST]
Other articles published on Sep 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+