
ఆ ఇద్దరిపై తగలేయడం మినహా..
హర్షల్ పటేల్, వానిందు హసరంగాలకు ఎక్కువ డబ్బులు తగలేయడం, విధ్వంసకర ఏబీడీని భర్తీ చేసే ఆటగాడిని తీసుకోకపోవడం తప్పితే మిగతా స్లాట్లను అద్భుతమైన ఆటగాళ్లతో నింపేసింది. దేశీయ స్టార్లపై ఎక్కువ నమ్మకం ఉంచింది. కాకపోతే అనుభవలేమి అభిమానులను కంగారుపెడుతుందే తప్పా జట్టు అన్ని విధాలుగానే బాగానే ఉంది. గత 13 సీజన్లుగా బలహీనమైన బౌలింగ్‌తో నెట్టుకొచ్చిన ఆర్‌సీబీ.. ఈ సారి మాత్రం ఆ విభాగాన్ని పటిష్టంగా మార్చింది. కానీ బ్యాటింగ్‌పై మరింత ఫోకస్ పెట్టలేకపోయింది. దాంతో మరోసారి మిడిలార్డర్, టాపార్డర్ బలహీనంగా కనిపిస్తోంది.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్..
అనూహ్యంగా ఫాఫ్ డుప్లెసిస్‌ను తీసుకున్న ఆర్‌సీబీ అతన్నే తమ జట్టు సారథిగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం విరాట్ కోహ్లీనే సారథ్య బాధ్యతలు చేపట్టేలా బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్న టీమ్‌మేనేజ్‌మెంట్ బ్యాకప్ కెప్టెన్లుగా ఫాఫ్ డుప్లెసిస్, దినేశ్ కార్తీక్‌లను ఎంచుకుంది. కెప్టెన్సీకి విరాట్ ఒప్పుకోకపోతే మాత్రం సౌతాఫ్రికా కెప్టెన్‌గా అనుభవం ఉన్న డుప్లెసిస్ జట్టును నడిపించే అవకాశం ఉంది. పైగా అతను అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న నేపథ్యంలో సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

ఓపెనర్‌గా అనూజ్ రావత్..
అయితే ఓపెనింగ్ జోడీ బలహీనంగా కనిపిస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఒకే తరహా బ్యాట్స్‌మన్. తక్కువ స్ట్రైక్‌రేట్‌లో నిలకడగా ఆడుతారే తప్పా.. విధ్వంసకరంగా బ్యాటింగ్ చేయలేరు. గత సీజన్‌లో దేవదత్ పడిక్కల్, కోహ్లీ కాంబినేషన్ ఈ బలహీనతతోనే బాధపడింది. ఈ క్రమంలోనే దేశవాళీ స్టార్ అనూజ్ రావత్‌ను ఓపెనర్‌గా ఫాఫ్‌తో కలిసి బరిలోకి దించే చాన్సుంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయిన అనూజ్ రావత్ దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలో దుమ్మురేపాడు. దాంతోనే ఆర్‌సీబీ కేఎస్ భరత్‌ను కాదని అనూజ్ రావత్ కోసం రూ.3.4 కోట్లు ఖర్చు చేసింది. అనూజ్ ఓపెనర్‌గా వస్తే విరాట్ ఫస్ట్ డౌన్‌లో.. మ్యాక్స్‌వెల్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నారు.

హిట్టర్లుగా కార్తీక్, మహిపాల్
వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్(రూ.5.5 కోట్లు) ఐదో స్థానంలో బ్యాటింగ్ దిగే చాన్సుంది. మహిపాల్ రోమ్‌రోర్(రూ.95 లక్షలు), వానిందు హసరంగా(రూ.10.75 కోట్లు) ఫినిషర్స్ రోల్స్ పోషించే అవకాశం ఉంది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ రూపంలో మంచి హిట్టర్ ఉన్నప్పటికీ ఓవర్ సీస్ కోటా ప్రకారం అతనికి తుది జట్టులో చోటు దక్కే చాన్స్ లేదు. 8వ స్థానంలో షెబాజ్ అహ్మద్ లేదా సిద్దార్థ్ కౌల్‌కు అవకాశం దక్కనుంది. హసరంగా, మహిపాల్ రోమ్‌రర్, మ్యాక్సీ రూపంలో స్పిన్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్ కావాలనుకుంటే కౌల్‌ను తీసుకునే అవకాశం ఉంది. పేసర్లుగా హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్‌తో పాటు ఓ ఓవర్‌సీస్ ఫాస్ట్ బౌలర్‌ను ఆడించనున్నారు. జోష్ హజెల్‌వుడ్‌కు అవకాశం దక్కనుంది.

బ్యాకప్ ఆప్షన్స్..
మెగా వేలంలో ఈసారి బ్యాకప్ ఆప్షన్స్‌పై ఆర్‌సీబీ గురిపెట్టినట్లు అనిపించింది. షెర్ఫెన్ రూథర్ ఫోర్డ్ నాలుగు నుంచి ఏడు వరకు ఏ స్థానంలోనైనా ఆడగలడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌కు అతను బ్యాకప్ ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. జోష్ హజెల్‌వుడ్‌కు జాసన్ బెహ్రాండార్ఫ్, డుప్లెసిస్‌కు ఫిన్ అలెన్ బ్యాకప్‌గా ఉన్నారు. ఫిన్ అలెన్ వికెట్ కీపింగ్ కూడా చేయగలడు. హర్షల్ పటేల్‌కు హైదరాబాద్ స్టార్ చామ మిలింద్ బ్యాకప్‌గా ఉన్నాడు. ఇక సిద్దార్థ్ కౌల్, కరణ్ శర్మలు సిరాజ్, హసరంగాలకు బ్యాకప్‌గా ఉండనున్నారు.

ఆర్‌సీబీ తుది జట్టు(అంచనా)
ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్, విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్(కీపర్), మహిపాల్ లోమ్‌రోర్, వానిందు హసరంగా, శబాజ్ అహ్మద్/సిద్దార్థ్ కౌల్, హర్షల్ పటేల్, జోష్ హజెల్ వుడ్, మహమ్మద్ సిరాజ్
ఓవరాల్ టీమ్
ఫాఫ్ డుప్లెసిస్(రూ.7కోట్లు), అనూజ్ రావత్(రూ.3.4 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), దినేశ్ కార్తీక్(కీపర్)(రూ.5.5 కోట్లు), మహిపాల్ లోమ్‌రోర్(రూ.95 లక్షలు), వానిందు హసరంగా(రూ.10.75 కోట్లు), శబాజ్ అహ్మద్(రూ.2.4 కోట్లు), హర్షల్ పటేల్(రూ.10.75 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ.7.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు), ఆకాశ్ దీప్(రూ.20 లక్షలు), సిద్దార్థ్ కౌల్(రూ.75 లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50 లక్షలు), ఫిన్ అలెన్(రూ. కోటి), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్(రూ.75 లక్షలు), డేవిడ్ విల్లే(రూ.2 కోట్లు), ప్రభుదేశాయ్(రూ.30 లక్షలు), లువిత్ సిసోడియా(రూ.20 లక్షలు), చామ మిలింద్(రూ.25 లక్షలు), అనీశ్వర్ గౌతమ్(రూ.20 లక్షలు).


Click it and Unblock the Notifications












