Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అప్పు చెల్లించమంటే కేసు పెట్టింది: యష్ దయాళ్

తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పేసర్ యష్ దయాళ్ ఖండించాడు. ఈ ఆరోపణలన్నీ అసత్యమని తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచియమైన సదరు యువతి తన దగ్గర లక్షల్లో అప్పు తీసుకుందని, తిరిగి చెల్లించమంటే అసత్య ఆరోపణలతో కేసు పెట్టిందన్నాడు. తన ఐఫోన్‌తో పాటు ల్యాప్ కూడా దొంగలించిందని, సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులకు యష్ దయాళ్ ఫిర్యాదు చేశాడు.

పెళ్లి పేరుతో తనను మోసం చేశాడని, లైంగిక సంబంధం పెట్టుకున్నాడని ఉజ్వల సింగ్ అనే యువతి ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. శారీరకంగా, మానసికంగా తనను వేధించాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. గత ఐదేళ్లుగా తనను అన్ని రకాలుగా వాడుకున్నాడని, పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చే సరికి ముఖం చాటేసాడని తెలిపింది. ఇతర అమ్మాయిలతో కూడా యష్ దయాళ్ సంబంధాలు పెట్టుకున్నాడని ఆరోపించింది. యష్‌ దయాళ్‌తో జరిపిన చాటింగ్ స్క్రీన్ షాట్స్, ఫోటోలు, వీడియో కాల్ రికార్డ్స్ వంటి పక్కా ఆధారాలు ఉన్నాయని కూడా వెల్లడించింది. రిలేషన్‌లో ఉన్న సమయంలో డబ్బులు తీసుకున్నట్లు కూడా పేర్కొంది.

RCB Star Yash Dayal Breaks Silence on Sexual Exploitation Allegations

ముందుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, దాంతోనే ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. సదరు యువతి ఫిర్యాదుపై స్పందించిన సీఎంవో.. పూర్తి విచారణ జరిపి జూలై 21లోపు నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. సీఎంఓ ఆదేశాలతో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద యష్ దయాళ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు.

అయితే సదరు యువతే తనకు భారీ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని యష్ దయాల్ పోలీసులను ఆశ్రయించాడు. తన ఐఫోన్, ల్యాప్ టాప్ దొంగలించిందని ఖుల్దాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. '2021లో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆ అమ్మాయి పరిచయమైంది. అప్పట్నుంచి ఇద్దరం మాట్లాడుకుంటున్నా. ఈ క్రమంలో నా నుంచి తన కుటుంబ సభ్యుల చికిత్స పేరుతో రూ. లక్షల సొమ్మును అప్పుగా తీసుకుంది. తిరిగి చెల్లిస్తానని చెప్పినా ఇప్పటి వరకు ఇవ్వలేదు. షాపింగ్ కోసమూ నా దగ్గర అప్పు చేసింది.

ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఆమెతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతున్నా. మరికొందరి ప్రమేయం కూడా ఉన్నట్లు అనుమానం ఉంది.'అని యష్ దయాల్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. సదరు యువతి పెట్టిన కేసును లీగల్‌గా ఎదుర్కొంటానని చెప్పాడు.

Story first published: Wednesday, July 9, 2025, 15:02 [IST]
Other articles published on Jul 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+