Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2026: అల్లు అర్జున్‌ని కలిసిన ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్!

పాన్ ఇండియా హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) స్టార్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ మర్యాదపూర్వకంగా కలిసాడు. శనివారం హైదరాబాద్‌లోని అల్లు అర్జున్ నివాసానికి వెళ్లిన వెంకటేశ్ అయ్యర్.. తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన సంతకంతో కూడిన ఆర్‌సీబీ జెర్సీని అల్లు అర్జున్ తనయుడు అయాన్‌కు బహుమతిగా అందజేశాడు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 'ప్రతిభావంతుడైన యంగ్ ఇండియన్ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్‌ను ఈ రోజు కలవడం చాలా సంతోషంగా ఉంది. మా అల్లు అయాన్‌కు తన సంతకంతో కూడిన ప్రత్యేకమైన జెర్సీని బహుమతిగా ఇచ్చినందుకు అతనికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మీ భవిష్యత్తు ప్రయత్నాలన్నింటికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రేమపూర్వక నమస్కారాలు'అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

RCB Star Venkatesh Iyer Meets Icon Star Allu Arjun Gifts Signed Jersey to His Son Allu Ayaan
Photo Credit: Allu Arjun (X)

ఉప్పల్‌లో వెంకటేశ్ ఊచకోత

వెంకటేశ్ అయ్యర్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఈ ఫొటోలను పంచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 55 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఓడినా.. ఆర్‌సీబీ టాప్ ప్లేస్‌ను కాపాడుకొని పరోక్షంగా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన వెంకటేశ్ అయ్యర్(19 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44) దూకుడుగా ఆడి అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.

ఈ మ్యాచ్ నేపథ్యంలోనే హైదరాబాద్‌కు వచ్చిన వెంకటేశ్ అయ్యర్.. తన అభిమాన హీరో అల్లు అర్జున్ కలిసాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన సంగతి తెలిసిందే. చాలా మంది టీమిండియా క్రికెటర్లు పుష్ప సినిమాను కొనియాడటంతో పాటు అల్లు అర్జున్ నటనపై ప్రశంసల జల్లు కురిపించారు.

క్వాలిఫయర్-1కు ఆర్‌సీబీ..

సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఆర్‌సీబీ ఓడినా పాయింట్స్ టేబుల్‌లో తమ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విరాట్ కోహ్లీ ఔటైన వెంటనే వ్యూహం మార్చి రన్‌రేట్ కాపాడుకోవడమే లక్ష్యంగా బ్యాటింగ్ చేసింది. దాంతో ఈ మ్యాచ్‌లో ఓడినా ఆర్‌సీబీ గెలిచనట్లు అయ్యింది. ఆర్‌సీబీతో పాటు గుజరాత్ టైటాన్స్‌తో సమంగా 18 పాయింట్స్ సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ రన్‌రేట్ కారణంగా మూడో స్థానానికే పరిమితమైంది.

మే 26న ధర్మశాల వేదికగా జరిగే క్వాలిఫైయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ చేరనుండగా.. ఓడిన జట్టుకు క్వాలిఫయర్-2 రూపంలో మరో అవకాశం ఉంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మే 27న ముల్లాన్‌పూర్ వేదికగా ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనుంది. సన్‌రైజర్స్ ఎలిమినేటర్ ప్రత్యర్థి ఎవరో ఇంకా ఖరారు కాలేదు. ఎలిమినేటర్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది.

Story first published: Saturday, May 23, 2026, 20:44 [IST]
Other articles published on May 23, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+