Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, ధోనీ కాదు.. అతనే బెస్ట్ ఐపీఎల్ కెప్టెన్: రజత్ పటీదార్

ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అత్యుత్తమ ఐపీఎల్ కెప్టెన్ అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి రజత్ పటీదార్ తెలిపాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో బెస్ట్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అని చెప్పిన పటీదార్.. అత్యుత్తమ వికెట్ కీపర్ ధోనీ అని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో జరిపిన చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ బ్యాటర్ తమ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అని చెప్పిన రజత్ పటీదార్.. కవర్ డ్రైవ్ ఆడే అత్యుత్తమ బ్యాటర్ కూడా కోహ్లీనే అని స్పష్టం చేశాడు. ఐపీఎల్ అత్యుత్తమ ఫీల్డర్ మాత్రం తమ మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అని పేర్కొన్నాడు. ఆశ్చర్యకరంగా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్‌గా డేల్ స్టెయిన్ పేరు సూచించాడు. స్పిన్ బౌలర్‌గా సునీల్ నరైన్ పేరు చెప్పిన రజత్ పటీదార్.. అత్యుత్త ఫినిషర్‌గా తమ మాజీ దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరును పేర్కొన్నాడు.

RCB Skipper Rajat Patidar Snubs Virat Kohli Names Rohit Sharma as the Best IPL Captain Ever

బెస్ట్ డెత్ ఓవర్‌ బౌలర్‌గా జస్‌ప్రీత్ బుమ్రా పేరు సూచించిన రజత్ పటీదార్.. బెస్ట్ టీమ్‌మేట్ కోహ్లీ అని చెప్పాడు. బెస్ట్ మ్యూజిక్ టేస్ట్ సాల్ట్, షెఫెర్డ్‌కు ఉందన్నాడు. తన ఐపీఎల్ కెరీర్‌లో అత్యుత్తమ క్షణం ఆర్‌సీబీ కెప్టెన్‌గా టైటిల్ అందుకోవడమేనని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ చిట్‌చాట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

అయితే ఐపీఎల్ అత్యుత్తమ కెప్టెన్‌గా రజత్ పటీదార్ రోహిత్ శర్మ పేరును చెప్పడంపై సోషల్‌మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతని అభిప్రాయంతో ఏకీభవిస్తుంటే మరికొందరు తప్పుబడుతున్నారు. ఐపీఎల్ ఆల్‌టైమ్ బెస్ట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అని ఒకరంటే.. రోహిత్ అని మరికొందరు వాదిస్తున్నారు.

ఐపీఎల్ 2026 సీజన్‌లో ఆర్‌సీబీ శుభారంభం చేసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆదివారం బెంగళూరు వేదికగా జరిగే తమ రెండో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆర్‌సీబీ అమీతుమీ తేల్చుకోనుంది.

Story first published: Thursday, April 2, 2026, 16:55 [IST]
Other articles published on Apr 2, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+