Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2025: టైటిల్ లేకున్నా.. ఆర్‌సీబీ మ్యాచ్‌లకే కోట్లలో వ్యూస్!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత 17 సీజన్లు ఒక్క టైటిల్ గెలవకున్నా ఆర్‌సీబీ అభిమాన గణం ఇసుమంత కూడా తగ్గలేదు. 'ఈ సాల కప్ నమ్‌దే'అంటూ ప్రతీ సీజన్‌‌లో ఊరించి ఊసురుమనించినా.. ఆ జట్టుపై ఆదరణ పెరిగిందే తప్పా ఏ మాత్రం తగ్గలేదు. ఒక్క టైటిల్ గెలవలేదని ప్రత్యర్థి జట్ల అభిమానులు గేలి చేసినా.. ఆర్‌సీబీ ఫ్యాన్స్ వెనకడుగు వేయలేదు.. జెర్సీలు మార్చలేదు. ఇంకా జట్టుపై ప్రేమను పెంచుకున్నారు. ఈ విషయం మరోసారి స్పష్టమైంది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో జియోహాట్ స్టార్ వేదికగా ఆర్‌సీబీ మ్యాచ్‌లకే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. ఐదేసి టైటిళ్లు గెలిచామని గొప్పగా చెప్పుకునే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆర్‌సీబీ మ్యాచ్‌లను కోట్ల మంది వీక్షించారు. ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి జియో హాట్‌స్టార్ 'క్యూములేటివ్ వ్యూస్' జాబితా ప్రకారం ఆర్‌సీబీ మ్యాచ్‌లకే రికార్డ్ వ్యూస్ వచ్చాయి.

RCB Sets Record for Most Cumulative Views on JioHotstar for IPL 2025 Match

క్యూములేటివ్ వ్యూస్ అంటే..?
ఒక వీడియో లేదా లైవ్ స్ట్రీమ్‌(ప్రత్యక్ష ప్రసారాన్ని)ను మొత్తం ఎన్నిసార్లు చూశారో తెలిపే సంఖ్య. ఒక వ్యక్తి ఒక వీడియోను చాలాసార్లు చూసినా, ప్రతి వీక్షణను లెక్కిస్తారు. ఉదాహరణకు, ఒక వీడియోకు 100 క్యూములేటివ్ వ్యూస్ ఉంటే..ఆ వీడియోను ప్రజలు మొత్తం 100 సార్లు చూశారని అర్థం. ఎంత మంది యూజర్స్ అనే లెక్కతో సంబంధం లేకుండా మొత్తం వ్యూస్‌ను పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు.

టాప్‌లో ఆర్‌సీబీ -కేకేఆర్ మ్యాచ్..
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఆర్‌సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన ఆరంభ మ్యాచ్‌కు మొత్తం 41.4 కోట్ల క్యూములేటివ్ వ్యూస్ వచ్చాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డ్. ఆ తర్వాత బెంగళూరు వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌కు 37.3 క్యూములేటివ్ వ్యూస్ వచ్చాయి. ఆర్‌సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్‌కు 34.1 వ్యూస్, ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్‌కే 34 కోట్లు వ్యూస్ రాగా.. సీఎస్‌కే వర్సెస్ ముంబై మ్యాచ్‌కు 30.9 కోట్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి. జియోహాట్ స్టార్ విడుదల చేసిన టాప్-8 మ్యాచ్‌ల వ్యూస్ జాబితాలో ఆరు ఆర్‌సీబీ మ్యాచ్‌లే ఉండటం గమనార్హం.

జియో హాట్‌స్టార్ అత్యధిక క్యూములేటివ్ వ్యూస్ వచ్చిన మ్యాచ్‌లు

ఆర్‌సీబీ వర్సెస్ కేకేఆర్ - 41.4 కోట్లు.

ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్కే - 37.3 కోట్లు.
ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ - 34.1 కోట్లు.
ఆర్‌సీబీ వర్సెస్ సీఎస్కే - 34 కోట్లు.
సీఎస్‌కే వర్సెస్ ఎంఐ - 30.9 కోట్లు.
ఆర్‌సీబీ వర్సెస్ పంజాబ్ కింగ్స్ - 28.8 కోట్లు.
ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ - 28.6 కోట్లు.
ఆర్‌సీబీ వర్సెస్ ఆర్ఆర్ - 27.9 కోట్లు.

Story first published: Monday, May 5, 2025, 16:12 [IST]
Other articles published on May 5, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+