క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ రిటెన్షన్ జాబితాలు విడుదలయ్యాయి. ఈ రిటెన్షన్ జాబితాల సమర్పణకు బీసీసీఐ విధించిన గడువు నేటి(గురువారం)తో ముగియడంతో ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్స్ స్టార్ స్పోర్ట్స్, జియోసినిమాలు 10 జట్ల రిటెన్షన్ జాబితాలను వెల్లడించాయి.
ఒక్కో జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను ప్రకటించాయి. అనూహ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గుర్ని మాత్రమే రిటైన్ చేసుకుంది. టాప్ ప్లేయర్‌గా విరాట్ కోహ్లీని రూ. 21 కోట్లకు రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. రజత్ పటీదార్‌ను రూ. 11 కోట్లకు, అనామక ప్లేయర్ యశ్‌దయాల్‌ను రూ. కోట్లకు అట్టిపెట్టుకుంది. రిటెన్షన్‌కు ఆర్‌సీబీ రూ. 37 కోట్లు ఖర్చు చేయగా.. ఆ జట్టు వద్ద ఇంకా రూ. 83 కోట్ల పర్స్ మనీ ఉంది.

కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌తో పాటు మహమ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్‌లను వేలంలోకి వదిలేసింది. ముగ్గుర్ని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ వద్ద మూడు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ఉంటాయి. ఈ మూడు ఆర్‌టీఎమ్ కార్డ్స్ ద్వారా ఆర్‌సీబీ తమ ఆటగాళ్లలో కొంతమందిని తిరిగి కొనుగోలు చేయవచ్చు.
ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్:
విరాట్ కోహ్లీ- రూ. 21 కోట్లు
రజత్ పటీదార్-రూ. 11 కోట్లు
యశ్ దయాల్-రూ. 5 కోట్లు
రిటెన్షన్ ఖర్చు అయిన డబ్బులు: రూ. 37 కోట్లు
పర్స్‌లో మిగిలి ఉన్న డబ్బులు: రూ. 83 కోట్లు
ఆర్‌సీబీ రిలీజ్ లిస్ట్:
బ్యాటర్లు: ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్(కీపర్), దినేశ్ కార్తీక్(రిటైర్మెంట్), సుయాష్ ఎస్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, సౌరవ్ చౌహన్
ఆల్‌రౌండర్లు: గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, కామెరూన్ గ్రీన్, మయాంక్ దగర్, మనోజ్ భాండగే, స్వప్నిల్ సింగ్
బౌలర్లు: ఆకాశ్ దీప్, అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, మహమ్మద్ సిరాజ్, టామ్ కరణ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రజన్ కుమార్, విజయ్ కుమార్ వైశాఖ్