Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

తమ్మీ.. ఎవడి మాట వినొద్దు: విరాట్ కోహ్లీ (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా టీనేజ్ సెన్సేషన్ , ఐపీఎల్ 2026 బెస్ట్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీని విరాట్ కోహ్లీ కలిసాడు.

ఈ 15 ఏళ్ల కుర్రాడిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న కోహ్లీ.. పలు సూచనలు చేశాడు. ఈ ఇద్దరి సంభాషణకు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ తాజాగా ఎక్స్‌ వేదికగా పంచుకుంది. 'తమ్మి.. ఎవడి మాట వినొద్దు.. నీ కష్టాన్ని నమ్ముకొని చెలరేగూ'అంటూ విరాట్ కోహ్లీ హిందీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

'ఇక్కడి నుంచి నువ్వు ఇంకా ఎత్తుకు ఎదగాలి. ఇప్పటివరకు జరిగిందంతా నీ కష్టపడే తత్వం, నమ్మకం వల్లే సాధ్యమైంది. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎలా మాట్లాడుతున్నారు అనేవి వినాల్సిన అవసరం లేదు. ఒక్క బిహారీ చాలు అందరిపై పైచేయి సాధించడానికి, ఇక అక్కడితో ప్రత్యర్థుల ఆట ముగిసిపోతుంది. (ఏక్ బిహారీ సబ్ పే భారీ)'అని వైభవ్‌తో విరాట్ కోహ్లీ అన్నాడు.

RCB Releases Video of Virat Kohli Special Ek Bihari Sab Pe Bhari Message to Vaibhav Sooryavanshi

ఈ సీజన్‌లో ఆర్‌‌సీబీపై కూడా వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన కనబరిచారు. కేవలం 26 బంతుల్లోనే 78 పరుగులు చేసి కోహ్లీని ఆకట్టుకున్నారు. జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలామ్ దార్, భువనేశ్వర్ కుమార్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్ల‌ను 300 స్ట్రైక్ రేట్‌తో ఎదుర్కొని బౌండరీల మోత మోగించాడు.

అతని ప్రదర్శనతో రియాన్ పరాగ్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 202 పరుగుల లక్ష్యాన్ని కేవలం 18 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించగలిగింది. ఈ ఇన్నింగ్స్‌లో వైభవ్ ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు బాదాడు. మ్యాచ్ తర్వాత, విరాట్ కోహ్లీ యువ బ్యాట్స్‌మెన్‌కు సంతకం చేసిన క్యాప్‌ను బహుమతిగా ఇవ్వగా.. వైభవ్ ఈ సీజన్ మొత్తం దానిని ధరించే ఆడాడు.

ఈ సీజన్‌లో మొత్తం 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్.. 237.30 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు సాధించాడు. 72 సిక్సర్లు కొట్టాడు. ఆరెంజ్ క్యాప్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ (MVP), అత్యధిక సిక్సర్లు, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ అవార్డులు గెలుచుకున్నాడు.

Story first published: Wednesday, June 3, 2026, 15:46 [IST]
Other articles published on Jun 3, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+