కోహ్లీకి జతగా..
ఈ క్రమంలోనే ఆర్‌సీబీ కూడా ఈసారి టాప్ ఆర్డర్‌లో మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్‌వెల్, మహమ్మద్ సిరాజ్‌లను మాత్రమే రిటైన్ చేసుకున్న ఆ జట్టు.. మిగతా వారందర్నీ వేలంలో కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్ ఫాఫ్ డుప్లెసిస్‌ను రూ. 7 కోట్లకు తీసుకుంది. సారథ్య బాధ్యతల నుంచి అతను తప్పుకోవడంతో ఫాఫ్‌ను కెప్టెన్ చేయాలని ఆ జట్టు భావిస్తోంది. అంతేకాకుండా టాపార్డర్‌లో అతన్ని కోహ్లీకి తోడుగా బరిలోకి దింపాలని ఆ జట్టు భావిస్తోంది. అందుకు సంబంధించిన ఓ మార్ఫింగ్ ఫొటోను అభిమానులతో పంచుకొని హింట్ ఇచ్చింది.

ట్విటర్‌లో ఆర్‌సీబీ హింట్..
‘కోహ్లీ, డుప్లెసిస్ ఆర్‌సీబీ జెర్సీలో ఉన్నట్లు రూపొందించిన ఫొటోను ట్విటర్ వేదికగా షేర్ చేసి ‘భవిష్యత్‌కు సంబంధించిన ఫొటో ఇది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కలిసి బరిలోకి దిగితే చూడాలని ఆసక్తిగా ఉంది" అని క్యాప్షన్‌గా పేర్కొంది. దీంతో వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేసే వీలుందని అభిమానులు భావిస్తున్నారు. ఇక డుప్లెసిస్ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. అతడు 14వ సీజన్‌లో రుతురాజ్ (635) తర్వాత అత్యధిక పరుగులు (633) చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టాపార్డర్‌లో డుప్లెసిస్ రాణిస్తాడని ఆర్‌సీబీ భావించి వేలంలో కొనుగోలు చేసింది.

టీమ్‌కు నష్టం..
అయితే ఫాఫ్ డుప్లెసిస్‌కు జతగా యువ ఓపెనర్ అనూజ్ రావత్‌ను ఆడిస్తారని ప్రచారం జరిగినా.. ఆర్‌సీబీ తాజా ట్వీట్‌తో కోహ్లీనే ఇన్నింగ్స్ ప్రారంభిస్తాడనే విషయం స్పష్టమవుతోంది. అయితే ఒకే తరహా బ్యాటింగ్ శైలి కలిగిన విరాట్, ఫాఫ్ డుప్లెసిస్‌లను ఓపెనర్లుగా పంపిస్తే.. పవర్ ప్లేలో స్కోర్ బోర్డు పరుగెత్తదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ ఇద్దరూ స్ట్రైక్ ప్లేయర్లే తప్పా.. బంతి బలంగా బాదేవారు కారనీ విశ్లేషకులు అంటున్నారు. ఈ ఇద్దరిలో ఒకరిని ఓపెనర్‌గా కొనసాగించి.. మరొక హిట్టర్‌ను జతచేయాలంటున్నారు.

ఆర్‌సీబీ ఓవరాల్ టీమ్
ఫాఫ్ డుప్లెసిస్(రూ.7కోట్లు), అనూజ్ రావత్(రూ.3.4 కోట్లు), విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు), గ్లేన్ మ్యాక్స్‌వెల్(రూ.11 కోట్లు), దినేశ్ కార్తీక్(కీపర్)(రూ.5.5 కోట్లు), మహిపాల్ లోమ్‌రోర్(రూ.95 లక్షలు), వానిందు హసరంగా(రూ.10.75 కోట్లు), శబాజ్ అహ్మద్(రూ.2.4 కోట్లు), హర్షల్ పటేల్(రూ.10.75 కోట్లు), జోష్ హజెల్ వుడ్(రూ.7.75 కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.7 కోట్లు), ఆకాశ్ దీప్(రూ.20 లక్షలు), సిద్దార్థ్ కౌల్(రూ.75 లక్షలు), కర్ణ్ శర్మ(రూ.50 లక్షలు), ఫిన్ అలెన్(రూ. కోటి), జాసన్ బెహ్రెన్‌డార్ఫ్(రూ.75 లక్షలు), డేవిడ్ విల్లే(రూ.2 కోట్లు), ప్రభుదేశాయ్(రూ.30 లక్షలు), లువిత్ సిసోడియా(రూ.20 లక్షలు), చామ మిలింద్(రూ.25 లక్షలు), అనీశ్వర్ గౌతమ్(రూ.20 లక్షలు).


Click it and Unblock the Notifications
